విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరైతే ఏంటీ?, అబద్ధం చెప్పారు: జేసీ దురుసు ప్రవర్తనపై అశోక్ గజపతి రాజు

విశాఖ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీ దివాకర్‌రెడ్డి అంశంపై తాజాగా అశోక్‌గజపతిరాజు స్పందించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అంశంపై తాజాగా కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్‌గజపతిరాజు స్పందించారు. ఇప్పటికే సదరు ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన దేశీయ విమానయాన సంస్థలు నిషేధం విధించాయి.

జేసీతో టీడీపీకి తలనొప్పి! రంగంలోకి సీఎం రమేశ్.. ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?జేసీతో టీడీపీకి తలనొప్పి! రంగంలోకి సీఎం రమేశ్.. ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?

విశాఖ ఎయిర్‌పోర్టుకు గంట ముందు వచ్చినట్లు జేసీ చెప్పారని, కానీ సీసీ టీవీ ఫుటేజ్‌లో అది అవాస్తవమని తేలిందని అశోక్ గజపతి రాజు చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి చిన్నచిన్న వివాదాలు పార్టీ పరువును దిగజారుస్తున్నాయని సీఎం చంద్రబాబు ఒకింత సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

విచారణకు ఆదేశం

విచారణకు ఆదేశం

గురువారం విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు సహా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు. విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపారు. భద్రతా సిబ్బంది వివరణ మేరకే విమానయాన సంస్థలు చర్యలు తీసుకున్నాయన్నారు.

చర్యలు తప్పవు..

చర్యలు తప్పవు..

జేసీ విమాన ప్రయాణ నిషేధం, కొనసాగింపు మంత్రిత్వశాఖ పరిధిలోకి రావని స్పష్టంచేశారు. సాధారణ ప్రయాణికుడైనా.. ప్రజాప్రతినిధి అయినా నిబంధనలు వర్తిస్తాయని కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. భద్రతా చర్యలకు ఎవరు విఘాతం కల్గించినా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

నిషేధం విధించిన ఎయిరిండియా, ఇండిగో..

నిషేధం విధించిన ఎయిరిండియా, ఇండిగో..

విశాఖ విమానాశ్రయం సిబ్బందిపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దురుసు ప్రవర్తనను దేశీయ విమానయాన సంస్థలు తీవ్రంగా పరిగణించాయి. ఈ మేరకు తమ విమానాల్లో జేసీ దివాకర్‌రెడ్డి ప్రయాణాన్ని నిషేధించాలని ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, గోఎయిర్‌ సంస్థలు నిర్ణయించిన విషయం తెలిసిందే.

విమానాశ్రయంలో జేసీ ఇలా..

విమానాశ్రయంలో జేసీ ఇలా..

గురువారం ఉదయం 7.30గం.కు ఎంపీ జేసీ ఎయిర్ పోర్టు టెర్మినల్ బిల్డింగ్ లోకి వెళ్లారు. ఆయన వెళ్లే విమానం 7.55గం.కు బయలుదేరాల్సి ఉండగా.. అంతకు 45నిమిషాల ముందే బోర్డింగ్ పాసులు ఇవ్వడం పూర్తి చేశారు. కానీ ఆలస్యంగా వెళ్లిన జేసీ.. బోర్డింగ్ పాస్ ఇవ్వాల్సిందిగా అధికారులతో పేచీకి దిగారు. అలా చేయడం నిబంధనలకు విరుద్దమని చెప్పినప్పటికీ.. తనతోనే రూల్స్ మాట్లాడుతారా? అంటూ ఫైర్ అయ్యారు. కౌంటర్ వద్ద ఉన్న ప్రింటర్ ను విసిరేయడంతో పాటు ఓ ఉద్యోగిని మెడ పట్టుకుని గెంటేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

English summary
Civil aviation minister Ashok Gajapathi Raju on Friday said he will get the entire incident involving TDP MP J C Diwakar Reddy at Vizag airport “enquired into” and will ensure that “lawful outcomes” follow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X