వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత: అదే జరిగితే డీఎంకే ప్రభుత్వం ? బీజేపీ ఆరా

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో రాష్ట్రంలో ఏమీ జరుగుతోంది ? అని పత్రిపక్ష డీఎంకే పార్టీ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. జరగరానిది ఎదైనా జరిగితే తాము అన్నింటికి సిద్దంగా ఉన్నామని పరోక్షంగా డీఎంకే పార్టీ నాయకులు కొందరు అంటున్నారు.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి 136 మంది శాసన సభ్యులు ఉన్నారు. డీఎంకే, కాంగ్రెస్ సంకీర్ణకూటమికి 98 మంది శాసన సభ్యులు ఉన్నారు.

ఒక వేళ అన్నాడీఎంకే పార్టీలో మనస్పర్థలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అధిష్టానాన్ని ఒప్పించాలని డీఎంకే పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

తమిళనాడులో అధికారంలోకి రావాలంటే 118 మంది శాసన సభ్యులు అవసరం అవుతుతారు. ఇప్పటికే తమ కంటే చిన్నవాడైన పన్నీరు సెల్వంను సీఎంగా కుర్చొపెట్టడానికి కొందరు సీనియర్లు ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

 DMK leaders: Jayalalithaa remains in grave situation despite best efforts !

ఇదే జరిగితే 20 మంది శాసన సభ్యులు డీఎంకేలోకి జంప్ అయితే ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకు డీఎంకే అధిష్టానం సిద్దంగా లేదని విశ్వసనీయ సమాచారం.

అవసరం అయితే ఎన్నికలకు వెళ్లి పూర్తి మెజారీటితో అధికారంలోకి రావాలని, ఇలా శాసన సభ్యులకు గాలం వేస్తే మంచిది కాదని డీఎంకే అధిష్టానం భావిస్తుందని తెలిసింది. మొత్తం మీద డీఎంకేలోకి జంప్ అయ్యి ఆ పార్టీతో జతకట్టడానికి కొందరు అన్నాడీఎంకే పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని అలాంటిది ఏమీ జరగదని అంటున్నారు. ఇప్పటికే సోమవారం జరిగిన శాసన సభ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు వారి మనసులోని మాట పెద్దలకు చెప్పారని సమాచారం. ఇది పార్టీ అంతర్గత సమావేశం అయినందున అన్ని విషయాలు బయటకు చెప్పడం భావ్యం కాదని అన్నాడీఎంకే పార్టీ సీనీయర్లు అంటున్నారు.

English summary
The hospital has denied a statement by the chief minister's party earlier today that she had a heart surgery this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X