వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారం రోజుల్లో పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోతోంది: స్టాలిన్ సంచలనం

తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వంపై డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14న, ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలవరకైనా పళనిస్వామి ప్రభుత్వం ఉంటుందా? అన్న అనుమానం వ్య

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వంపై డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14న, ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలవరకైనా పళనిస్వామి ప్రభుత్వం ఉంటుందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకెలో సంక్షోభం చోటుచేసుకొంది. పార్టీ నుండి శశికళ, దినకరన్ లను పార్టీ నుండి బహిష్కరించారు.

జైలు నుండి బయటకు వచ్చిన దినకరన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చలు జరిపారు. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి పళనిస్వామి సీరియస్ గా స్పందించారు. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడ దినకరన్ తో సమావేశం కాకూడదని హెచ్చరించారు.

stalin

ఇదిలా ఉంటే పళనిస్వామి ప్రభుత్వంపై డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14వ, తేది నాటికి కూడ పళనిస్వామి ప్రభుత్వం ఉంటుందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఉంటే తమ పని తాము చేసుకొంటూపోతామని ఆయన వ్యంగ్యంగా చెప్పారు.

అన్నాడీఎంకే ఇప్పటికే మూడు ముక్కలైందని, భవిష్యత్తులో ఎన్ని ముక్కలౌతోందో ఊహించడం కష్టమని స్టాలిన్ వ్యాఖ్యానించారు. కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి నిర్వహించిన సెమినార్ లో స్టాలిన్ మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో డిఎంకె అధికారంలోకి వస్తే నీటినిల్వ కోసం ట్యాంకులు ఏర్పాటుచేస్తామని, చెరువులు నిర్మిస్తామన్నారు. డీఎంకె తప్పకుడా అధికారంలోకి వస్తోందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

English summary
DMK working president sensational comments on Tamil nadu chief minister Palaniswami on Tuesday.Palani government will dismiss before June 14.DMK will come power in Tamil nadu state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X