వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినిని రేప్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చెయ్యకూడదని పంచాయితీ పెద్దల తీర్పు !

ఇంటిలో ఒంటరిగా ఉన్న బాలిక మీద అత్యాచారం చేసిన నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యరాదని పంచాయితీ పెద్దలు ఆదేశాలు జారీ చేసిన ఘటన బీహార్ లో జరిగింది. పంచాయితీ పెద్దల ఆదేశాలను లెక్కచయ్యకుండా బాధితులు బైస

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఇంటిలో ఒంటరిగా ఉన్న బాలిక మీద అత్యాచారం చేసిన నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యరాదని పంచాయితీ పెద్దలు ఆదేశాలు జారీ చేసిన ఘటన బీహార్ లో జరిగింది. పంచాయితీ పెద్దల ఆదేశాలను లెక్కచయ్యకుండా బాధితులు బైసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీహార్ లోని పూర్ణియా జిల్లాలోని బైసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల బాలిక ఆరో తరగతి చదువుతోంది. ఇంటిలో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని గ్రామ పెద్దలను ఆశ్రయించారు.

Don’t approach police: Panchayat tells 11-year-old rape victim in Bihar

గ్రామ పెద్దలు తమకు న్యాయం చేస్తారని బాధితులు ఎదురు చేశారు. అయితే పంచాయితీ పెద్దలు మాత్రం బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు వేచి ఉండాలని, తరువాత అత్యాచారం చేసిన యువకుడితోనే ఆమె వివాహం జరిపిస్తామని బాలిక కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

అంతటిలో నోరుమూసుకోని గ్రామ పెద్దలు ఈ విషయంపై పోలీసులకు మాత్రం ఫిర్యాదు చెయ్యరాదని బాధితురాలి కుటుంబ సభ్యులను హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని సూచించారు. అయితే బాలిక కుటుంబ సభ్యులు ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

English summary
the panchayat took a decision that the rape victim would not lodge a complaint in the local police station and asked her to wait till she is 18 as the accused will marry her, a district police official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X