వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూసైడ్: ‘డబ్బును ప్రేమించే ఈ లోకంలో ఉండలేను’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ 13ఏళ్ల బాలుడు తన పుట్టిన రోజుకు ముందు రోజే సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.

అయితే, అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణమే ఆందోళన కలిగించేదిగా ఉంది. తన తల్లిదండ్రులు విభేదాలతో విడిపోవడంతో అతడు వాట్సప్‌లో సూసైడ్ నోట్ పోస్టు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆ సూసైడ్ నోట్‌లో ఈ విధంగా రాశాడు. ‘మానవ సంబంధాల కంటే డబ్బుకే ఎక్కువ విలువనిచ్చే ఈ ప్రపంచంలో నేను బతకలేను' అని రాశాడు.

కొద్ది రోజుల క్రితం తన అత్తమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన 9వ తరగతి చదువుతున్న షాను అనే ఈ బాలుడు మంగళవారం రాత్రి 12.30గంటలకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గదిలో శిఖర్ అనే తన సోదరిడితో పడుకున్న సమయంలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు షాను.

Don't want to live in a 'money loving' world: 13-year-old boy writes in suicide note on WhatsApp

కొంతసేపటి తర్వాత శిఖర్.. సోదరుడు షాను ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి వెంటనే తన అత్తకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన షానును బంధువులు ఆస్పత్రికి తరలిచారు. కాగా, అప్పటికే షాను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోలీసులు మృతుడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకన్నారు. కాగా, డబ్బు సంపాదించేందు కోసం షాను తల్లి దుబాయ్‌లో ఉంటుండగా, తండ్రి ఫొటో గ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తూ ఢిల్లీలో ఉంటున్నారు.

తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటంతో షాను, శిఖర్‌లు ఘజియాబాద్‌లోని తమ అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు. అయితే పలుమార్లు షాను అస్వస్థతకు గురయ్యాడు. అయినా కూడా తల్లిదండ్రులు తన పట్ల ఎలాంటి బాధ్యత చూపకపోవడంతో షాను ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 15న తన అత్త ఇంటికి వచ్చిన షాను మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

English summary
A 13-year-old boy committed suicide here by hanging himself from a ceiling fan, just a day before his birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X