వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో అతి పెద్ద చోరీ: 22 కోట్లతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ పరారీ, అరెస్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి అతిపెద్ద దోపిడీ జరిగింది. ఏటీఎంలలో నగదు పెట్టేందుకు నగదు చేరవేసే వ్యాన్ డ్రైవర్ రూ.22 కోట్లతో చెక్కేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నింపేందుకు డీఎల్ 1ఎల్ కే 9189 వాహనంలో బయలుదేరిన డ్రైవర్ ప్రదీప్ శుక్లా గోవింద్ పూరి వద్ద వాహనాన్ని దారిమళ్లించి రూ. 22 కోట్లతో పరారయ్యడు.

రోడ్డు పక్కనే
లఘుసంఖ తీర్చుకుంటానని, వాహనాన్ని గోవింద్ పురి మెట్రో స్టేషన్ వద్ద ఉంచమని సెక్యూరిటీ గార్డ్ వినయ్ పటేల్... డ్రైవర్‌ను కోరాడు. దీంతో పక్క వీధిలో వేచిఉంటానని వినయ్ పటేల్‌కు డ్రైవర్ ప్రదీప్ శుక్లా(35) తెలిపాడు. వినయ్ వెళ్లి చూసేసరికే వాహనంతో పాటు డ్రైవర్ కూడా కనిపించలేదు.

దీంతో జరిగిన విషయాన్ని సంబంధిత బ్రాంచ్ అధికారులకు సెక్యూరిటీ గార్డ్ వినయ్ పటేల్ తెలియజేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వికాస్‌పురి శాఖ నుంచి రూ.38 కోట్లను నాలుగు వాహనాల్లో పంపినట్లు యాక్సిస్ బ్యాంకు అధికారులు తెలిపారు.

 Driver of cash van runs away with Rs 22 crore in Delhi

దక్షిణి ఢిల్లీకి వెళుతున్న వాహనం (డీఎల్ 1ఎల్‌కే 9189)లో రూ. 22.5 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గంట తర్వాత ఓ పెట్రోల్ బంక్ వద్ద వ్యాన్ ను కనుగొన్నారు. అయితే అందులో డబ్బు మాత్రంలేదు.

దీంతో బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు డ్రైవర్ ఇంటితోపాటు అతడికి సంబంధించిన అన్ని చోట్ల మకాం వేశారు. పోలీస్ చెక్ పోస్టులను అప్రమత్తం చేసి నిందితుడు ప్రదీప్ శుక్లాను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. భారీ చోరికి పక్కా ప్లాన్ వేసి, దానిని విజయవంతంగా అమలు చేసిన ప్రదీప్ పారిపోవడంలో మాత్రం విఫలమయ్యాడు.

నగరంలోని ఓక్లా ప్రాంతంలో దాక్కుందామన్న అతడి యత్నం విఫలమైంది. ఓక్లా ప్రాంతంలో వ్యాన్ ను గుర్తించిన పోలీసులు అదే ప్రాంతంలో దాచిన చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇక అతగాడికి సహకరించిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

English summary
In a daring incident of robbery, the driver of a cash van absconded with more than 22 crore rupees of cash. The cash was inside a locked box which the thieves have stolen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X