వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ కేసు: సెల్‌ టవర్‌ లొకేషన్‌, హెల్త్‌ రిపోర్టులే కీలకం.. బయటపడేందుకు కొత్త ఎత్తులు..

డ్రగ్స్‌ వ్యవహారంలో రెండో విడతలో భాగంగా ఏడుగురికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే నోటీసులు, విచారణను తప్పించుకునేందుకు టాలీవుడ్‌ తారలు కూడా సరికొత్త ఎత్తులు వేస్తున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్‌ను వణికిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారంలో రెండో విడతలో భాగంగా ఏడుగురికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అదే సమయంలో నోటీసులు మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. విచారణను తప్పించుకునేందుకు టాలీవుడ్‌ తారలు కొత్త ఎత్తులు వేస్తుండడమే ఇందుకు కారణం.

ఎక్పైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ నోటీసుల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు అధికారులకు కొత్త కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపింది. 19 నుంచి విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

drug-addiction

అయితే ఈ ఆరోపణలను టాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. నోటీసులు అందుకున్న వారంతా సినీ పెద్దలను ఆశ్రయిస్తున్నారు. సిట్‌ నోటీసులకు బ్రేక్‌ పెట్టేందుకు మంతనాలు జరుపుతున్నారు. తమ సెల్‌ఫోన్లు ఎప్పుడూ తమ వ్యక్తిగత సహాయ సిబ్బంది వద్దే ఉంటాయనే కొత్త వాదన వినిపిస్తున్నారు. తమవద్ద పనిచేసే వారే దుర్వినియోగం చేసి ఉండొచ్చంటూ వివరణ ఇస్తున్నారు.

చట్టాన్ని తాము గౌరవిస్తాం కానీ.. అన్యాయంగా కేసుల్లో ఎలా ఇరికిస్తారంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో సిట్ మరింత పట్టుదలగా ముందుకెళ్తోంది. సెల్‌ టవర్‌ లొకేషన్‌, హెల్త్‌ కండిషన్‌ రిపోర్టులు తెప్పించుకుంటోంది. పూర్తిగా ఆధారాలు సేకరించాకే పేర్ల వెల్లడికి సిద్ధమవుతోంది.

English summary
At present Drugs Case is creating sensation in tollywood industry. Part of the second phase.. SIT is ready to send notices for more seven cine personalities. But stars of the tollywood also trying to put fullstop to SIT actions. In this regard they approached Tollywood Top Personalities and trying to effort to stop the issuing of the notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X