వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ షాకింగ్: టీ, సమోసా కోసం రూ.1కోటి ఖర్చు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సమోసా చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఆయన రూ.కోటి సమోసా స్కాం ఆరోపణలలో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సమోసా చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఆయన రూ.కోటి సమోసా స్కాం ఆరోపణలలో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

<strong>లండన్ డాక్టర్ బిల్లుకు అపోలో మెలిక: జయ వేలిముద్రలపై మరో నిజం వెలుగులోకి</strong>లండన్ డాక్టర్ బిల్లుకు అపోలో మెలిక: జయ వేలిముద్రలపై మరో నిజం వెలుగులోకి

బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గా ఢిల్లీలో రద్దీ ప్రాంతంలో ఓ పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ రూ.కోటి సమోసా కుంభకోణంలో చిక్కుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ బ్యానర్‌పై అందరి దృష్టి పడింది. నా వద్ద రూ.1కోటి విలువ గల సమోసాలు ఉన్నాయని బ్యానర్లో ఉంది.

టీ, సమోసాల కోసమే రూ.1కోటి ఖర్చు

టీ, సమోసాల కోసమే రూ.1కోటి ఖర్చు

గత 18 నెలల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం కేవలం టీ, సమోసాల కోసమే రూ.కోటి ఖర్చు పెట్టిందని ఆయన ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు సేకరించారని చెబుతున్నారు.

కేజ్రీవాల్ ఇంట లంచ్ కోసం ఒక్కొక్కరికి రూ.13,000

కేజ్రీవాల్ ఇంట లంచ్ కోసం ఒక్కొక్కరికి రూ.13,000

అరవింద్ కేజ్రీవాల్ ఇంట లంచ్ కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని కొద్ది రోజుల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఈ లంచ్ కోసం ఒక్కో వ్యక్తికి రూ.13,000 ఖర్చు అయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ లంచ్ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్త ఇటీవల డిమాండ్ చేశారు.

పీయుష్ గోయల్ విమర్శలు

పీయుష్ గోయల్ విమర్శలు

ప్రభుత్వం అంటే ప్రజల ధనానికి సంరక్షణగా ఉండాలని, కానీ కేజ్రీవాల్, ఆయన ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా డబ్బులను దుర్వినియోగం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు.

బిల్లులకు ఆమోదం తెలపలేదని మనీష్ సిసోడియా

బిల్లులకు ఆమోదం తెలపలేదని మనీష్ సిసోడియా

ఇప్పుడు టీ, సమోసాల కోసం రూ.1 కోటి ఖర్చు దుమారం రేపుతోంది. ఈ ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఖండించారు. టీ, సమోసా బిల్లులు తన అప్రూవల్ కోసం తన వద్దకు వచ్చాయని, కానీ తాను వాటిని ఆమోదించలేదని వివరణ ఇచ్చారు

English summary
Now the Aam Aadmi Party has been accused of a Rs 1 crore samosa scam. BJP's spokesperson, Tajinder Pal Singh Bagga put up posters in Delhi alleging that the Arvind Kejriwal led Delhi government had spent over Rs 1 crore of public money on tea and samosas in the last 18 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X