వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోటో ఫోజులకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను ఫోటో ఫోజుల కోసం చీపురు పట్టనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు. న్యూఢిల్లీలోని జేజే క్లస్టర్స్‌లో నివసిస్తున్న ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు వెంకయ్య అక్కడ పర్యటించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు ఫోటో గ్రాఫర్లు.. చీపురు పట్టుకోవాలని ఆయనను కోరారు. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలై దాదాపు నెల కావొస్తుందన్నారు. ఫోటోల కోసం కాకుండా నిర్మాణాత్మక చర్యల పైన దృష్టి సారించాలన్నారు.

2022 నాటికి దేశంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పేదల పాలిట దేవుడు అన్నారు. చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలను చూసి ఈ సందర్భంగా వెంకయ్య చలించిపోయారు. పేదలను దృష్టిలో పెట్టుకొని మోడీ చేపట్టిన పథకాలను ఆయన ప్రజలకు వివరించారు.

Efforts on to achieve total garbage management in Delhi: Venkaiah Naidu

పారిశుద్ధ్యం క్షీణించడం వల్ల వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు ఏటా రూ.6500 చొప్పున మందుల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. స్వచ్ఛ భారత్ ద్వారా పారిశుద్ధ్య సమస్య తీరుతుందన్నారు. పరిశుభ్రత పైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూ.1800 కోట్లతో వివిద కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.

మాత్‌ స్థావరాలను నాశనం చేయండి: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ దేశంలో ఉగ్రవాద సంస్థ జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ (జేఎంబీ) స్థావరాలన్నింటినీ నాశనం చేయాలని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదేశించారు. పశ్చిమబెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో పేలుళ్లు జరిగిన తరువాత జేఎంబీకి భారత్‌లో ఉన్న స్థావరాల గురించి బయటపడింది. బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంస్థ పని చేస్తోంది.

ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా సూర్య ప్రకాశ్‌

న్యూఢిల్లీ ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా ప్రముఖ జర్మలిస్ట్‌ సూర్యప్రకాశ్‌ నియమితులయ్యారు. ఉప రాష్ట్రపతి హమిద్‌ అన్సారీ నేతృతంలో ని త్రిసభ్య కమిటీ సిఫారసుతో ఆయనను నియమిస్తున్నట్లు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. కర్ణాటకకు చెందిన సూర్య ప్రకాశ్‌, గతంలో ఈనాడు దినపత్రికలో పొలిటికల్‌ ఎడిటర్‌గా పని చేశారు.

English summary
NEW DELHI: All efforts are being made to ensure total management of waste in the national capital with steps being taken to achieve 100 per cent door-to-door collection of domestic garbage, Union Minister M Venkaiah Naidu said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X