హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేఎన్‌యులో దేశ వ్యతిరేక కార్యకలాపాలు: మాజీ సైనికులు, పాక్‌కు మద్దతుగా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు దాడి ఘటనలో ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతకు మద్దతుగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జెఎన్‌యు) ప్రదర్శనలు జరగడంపై ఇదే వర్సిటీలో జరిగిన మాజీ సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు జెఎన్‌యు కేంద్రంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అఫ్జల్ గురు వంటి తీవ్రవాదులకు మద్దతు పలకడమంటే సైనికులను అవమానపర్చడమేనని వారు అభిప్రాయపడ్డారు.

ఇలాగే ఆందోళనలు కొనసాగిస్తే తమ డిగ్రీలను వెనక్కి తిరిగి ఇస్తామని వీసీ జగదీశ్ కుమార్‌కు మాజీ సైనికులు లేఖ రాశారు.

Ex-Soldiers Threaten To Return Degrees Over 'Anti-National Activities' At JNU

కాగా, టెర్రరిస్ట్ అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి దాదాపు 8మంది విద్యార్థులను డిబార్ చేశారు. ఓ విద్యార్థి నేతను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా జేఎన్‌యు విద్యార్థులకు మద్దతు పలుకుతున్నట్లు ఉగ్రవాది హఫీజ్ సయీద్ ట్వీట్ చేశాడు.

'పాకిస్తాన్‌కుమద్దతుగా నిలుస్తున్న జేఎన్‌యూ విద్యార్థి సోదరులకు మద్దతు ఇవ్వాల్సిందిగా, మన పాక్ సోదరులను కోరుతున్నా' అంటూ జేఎన్‌యులో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా ఉగ్రవాది హఫీజ్ సయిద్ చేసినట్లుగా ట్వీట్ ఉంది. ఫిబ్రవరి 10న అతను ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు దృష్టి సారించారు.

English summary
The row over an event at the Jawaharlal Nehru University (JNU) to protest Parliament attack convict Afzal Guru's execution escalated on Saturday with former army officers threatening to return their degrees from the institution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X