బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌‍బుక్ లవ్, కోరిక తీరింది: వేరే యువతితో ఎంగేజ్‌మెంట్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతిని ప్రేమించి, ఆమెతో లైంగిక వాంచ తీర్చుకుని చివరికి చేతులు ఎత్తేసిన యువకుడిని బెంగళూరులోని బయ్యప్పనహళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడికి వేరే యువతితో ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

నిశ్చితార్థం ఫోటోలు సైతం అతను ఫేస్ బుక్ లో పెట్టడంతో అతని బండారం బయటపడింది. బెంగళూరు నగరంలోని ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేష్ రాఘవన్ ఫేస్ బుక్ లో యువతితో పరిచయం పెంచుకున్నాడు.

అనంతరం ఆమెను ప్రేమించినట్లు నటించాడు. కొన్ని నెలల నుండి ఆమెతో లైంగిక వాంచ తీర్చుకున్నాడు. వివాహం చేసుకోవాలని యువతి చెప్పింది. అందుకు అతను నిరాకరించాడు. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని రాజేష్ రాఘవన్ బెదిరించాడు.

facebook love cheating case booked in Bengaluru

యువతి నెల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసి కొన్ని ఆధారాలు ఇచ్చింది. విషయం తెలుసుకున్న రాజేష్ రాఘవన్ అప్పటి నుండి మాయం అయ్యాడు. పోలీసులు అతని కోసం చాలాచోట్ల గాలించారు. చివరికి బుధవారం రాత్రి అతనిని అరెస్టు చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విదించడంతో జైలుకు పంపించారు.

రాజేష్ రాఘవన్ కు రెండు నెలల ముందు నిశ్చితార్థం జరిగిందని పోలీసులు అన్నారు. నిశ్చితార్థం ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టాడు. పోలీసులు ఆ ఫోటోలను సేకరించారు. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
facebook love cheating case booked byappanahalli police in bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X