వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమించాడు.. ప్రపోజ్ చేశాడు.. ఒప్పుకోకపోవడంతో ఉగ్రవాదిగా మారాడు

జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ ఉగ్రవాదిగా మారడం వెనుక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ప్రేమలో విఫలమవడం వల్లే అతడు ఉ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు భద్రతా దళాలు గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. బుర్హాన్ వానీ స్థానంలో అతని వారసుడిగా హిజ్బుల్ కమాండర్ పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ ను భద్రతా దళాలు శనివారం మట్టుబెట్టాయి.

అయితే సబ్జార్ అహ్మద్ ఎలా ఉగ్రవాదిగా మారాడన్న విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సబ్జార్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు ఆ ప్రపోజ్ ను అసలు ఒప్పుకోలేదు. సబ్జార్ అహ్మద్ కు తన కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేదని తేల్చి చెప్పారు.

sabzar-ahmad-bhat

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సబ్జార్ ఉగ్రవాదానికి ప్రేరేపితుడయ్యాడు. దక్షిణ కశ్మీర్ రత్సునా గ్రామానికి చెందిన వాడు ఈ సబ్జార్. బుర్హాన్ వానీకి చిన్ననాటి మిత్రుడు. అప్పటికే బుర్హాన్ వానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు సారథ్యం వహిస్తున్నాడు. టెర్రరిజంలోకి చేరడానికి సబ్జార్ పోలీసుల నుంచి రైఫిల్ దొంగతనం చేశాడు. 2015 ఏప్రిల్ లో ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు.

బుర్హాన్ వానీ తర్వాత వారసుడిగా పగ్గాలు పొందిన సబ్జార్ అహ‍్మద్ కు ఇన్నర్ సర్కిల్ లో ఎక్కువగా సబ్ డాన్ గా పేరుంది. జూలైలో బుర్హాన్ చనిపోయాక, హిజ్బుల్ ముజాహిద్దీన్ లోకి యువతను రిక్రూట్ మెంట్ చేసుకునే బాధ్యతను తనే తీసుకున్నాడు. అండర్ గ్రౌండ్ ద్వారానే ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. బుర్హాన్ వానీలాగా కాకుండా.. ఇతడు సోషల్ మీడియాకు దూరంగా ఉండేవాడు.

English summary
Hizbul terrorist Sabzar Ahmad Bhat, who was killed in an encounter with security forces in Tral area of south Kashmir's Pulwama district on Saturday, turned to terror after his marriage proposal was rejected. A native of Rathsuna village in Tral in southern Kashmir, Sabzar was said to be a close friend of slain Hizb-ul-Mujahideen terrorist Burhan Wani. Sabzar snatched a rifle from a policeman and joined the ranks of terrorists in April 2015 after Burhan Wani's brother, Khalid, was killed by forces in Kamla forests of Tral town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X