బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒళ్లంతా గోల్డ్: మంత్రి కూతురికి పెళ్లైందని వాట్సప్ ప్రచారం, ఫేక్ ఫోటో

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాష్ట్ర మంత్రి యూటీ ఖాదెర్‌ను లక్ష్యంగా చేసుకొని వాట్సప్‌లో ఫేక్ సందేశాలు పెట్టడంతో విధాన సౌధ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. మంత్రి ఖాదెర్ కూతురు ఇటీవలె పెళ్లి చేసుకున్నారంటూ వాట్సప్ సందేశంలో వచ్చింది. ఇది వాట్సప్ ద్వారా నెట్లో జోరుగా వ్యాపించింది.

ఫిర్యాదు మేరకు... మంత్రి యూటీ ఖాదెర్ చిన్న కూతురు ఇటీవల పెళ్లి చేసుకుందని వాట్సప్ ద్వారా ఓ ఫేక్ ఫోటో వ్యాపించింది. ఆ ఫోటోలో ఉన్న యువతి ఒళ్లంతా బంగారు ఆభరణాలతో నిండి ఉంది. ఆమె ఖాదెర్ కూతురు అని అందులో ఉంది.

అయితే, ఖాదెర్‌కు పెళ్లీడుకు వచ్చిన ఎలాంటి కూతురు లేదని పోలీసులు చెప్పారు. ఖాదెర్‌కు ఒక్క కూతురు మాత్రమే ఉన్నారు. ఆమె వయస్సు 12 ఏళ్లు. ఆమె ప్రైమరీ స్కూల్లో చదువుతోంది. ఆమె కేరళలోని ఓ సాధారణ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది.

 Fake pic of minister's daughter, FIR filed in Bengaluru

ఈ ఫేక్ మెసేజ్ పట్ల మంత్రి ఖాదెర్, ఆయన కుటుంబ సభ్యులు చాలా వేదనకు గురయ్యారని పోలీసులు చెప్పారు. మంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషయమై పలు ఫోన్ కాల్స్ వచ్చాయని, అలాగే న్యూస్ చానల్స్‌లలో వచ్చాయని, వాటికి వారు సమాధానం చెప్పలేకపోవడమే కాకుండా ఆశ్చర్యానికి లోనయ్యారన్నారు.

మెసేజ్‌లో ఒంటినిండా బంగారు ఆభరణాలతో ఉన్న యువతి ఎవరో తెలియని వ్యక్తి అని, ఆమెకు ఖాదెర్‌తో లేదా ఆయన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వారం రోజులుగా ఈ ఫేక్ ఫోటో విషయమే పలువురు రాజకీయ నాయకులు, ఇతరులు ఖాదెర్‌ను అడుగుతున్నారని చెప్పారు.

ఎవరో ఖాదెర్ కూతురు పెళ్లి ఆడంబరంగా జరిగిందని అసత్య ప్రచారం చేశారన్నారు. ఈ పని ఎవరు చేశారో తెలియదని, తమను మనోవేధనకు గురి చేశారని, అయితే, ఇలాంటివి ప్రజా జీవితంలో సాధారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు గురువారం నాడు కేసు రిజిస్టర్ చేశారు.

English summary
An case has been registered in Vidhana Soudha police station Bengaluru over a fake message in Whats App targeting Health Minister U.T.Khadar. Whats App messages were being circulated showing Khadar’s daughter as recently married.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X