వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులపై ఇలానా?: ఆత్మహత్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రైతులను పరామర్శించడానికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మందసౌర్ వెళ్లిన రోజే.. భూపేందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

భోపాల్: గిట్టుబాటు ధర కోసం.. రుణమాఫీ కోసం.. రైతన్నలు రోడ్డెక్కి ఆర్తనాదాలు చేస్తుంటే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రికి మాత్రం అవి వ్యక్తిగతమే అన్నట్లుగా కనిపించాయి. రైతులు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డా. వాటి వెనుక కూడా వ్యక్తిగత కారణాలే ఉండవచ్చునేమో అని నిర్లక్ష్య వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్ హోంమత్రి భూపేందర్ సింగ్ బుధవారం నాడు రైతుల ఆత్మహత్యలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాంటే.. కేవలం అప్పులే దానికి కారణం అనుకోవడానికి లేదు. వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు'అంటూ వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ వైఫల్యమే అన్న ఆరోపణను కప్పి పుచ్చుకోవడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.'

Farmer suicides due to personal reasons too, says MP minister after Mandsaur violence

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రైతులను పరామర్శించడానికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మందసౌర్ వెళ్లిన రోజే.. భూపేందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, మందసౌర్ లో పోలీసుల కాల్పులు జరపలేదని తొలుత బుకాయించిన భూపేంద్ర సింగ్.. ఆ తర్వాత రెండు రోజులకు మాట మార్చారు. పోలీసుల కాల్పుల్లోనే ఐదుగురు రైతులు మృతి చెందారని చెప్పారు.

ఇదిలా ఉంటే, సమస్యల పరిష్కారం కోసం రైతులంతా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దీక్షలు, నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. పలు బస్సులు, ద్విచక్ర వాహనాలు ఈ గొడవల్లో దగ్దమయ్యాయి. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ ఐదుగురు రైతులు సైతం ప్రాణాలు కోల్పోయారన్న విమర్శ ఉంది.

English summary
Even as his state is marred by farmers' protests, Madhya Pradesh Home Minister claimed that farmer suicides in the state may have been due to personal reasons. After six farmers lost their lives in Madsaur violence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X