వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ 'మగాడు' అనిపించుకోవాలంటే.. నెల రోజులు దానికి సిద్దపడాల్సిందే!

ఇక్కడ ఎదిగొచ్చిన అబ్బాయిలు 'మగాడు'గా నిరూపించుకోవాలంటే నెల రోజుల వనవాసం చేయాల్సిందే.

|
Google Oneindia TeluguNews

జిగ్వింకర్: కొన్ని రకాల ఆచార సాంప్రదాయాల గురించి వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. పశ్చిమ ఆఫ్రికాలోని సెనగల్ దేశంలో జిగ్వింకర్ అనే ప్రాంతంలో ఉన్న ఓ తెగ సాంప్రదాయం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఇక్కడ ఎదిగొచ్చిన అబ్బాయిలు 'మగాడు'గా నిరూపించుకోవాలంటే కఠిన పరీక్షలు ఎదుర్కోక తప్పదు.

ఇందులో ముఖ్యమైనది వనవాసం. నెల రోజుల పాటు చెట్టు పుట్టల మధ్య జీవనం సాగించి.. తిరిగి గ్రామానికి చేరుకుంటేనే వారిని మగాళ్లుగా గుర్తిస్తారు. ఆ సమయంలో అబ్బాయిలకు తోడుగా వారి తండ్రులు కూడా అడవి బాట పడుతారు. మొత్తం గ్రామంలో మహిళలు మాత్రమే మిగిలిపోతారు.

 Fascinating snapshot of villagers' rite of passage as young men risk their lives during month-long initiation in depths of forest

అయితే ఈ వనవాసానికి బయలుదేరే ముందు కొన్ని రకాల ఆచారాలను వారు పాటిస్తారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫోటోగ్రాఫర్ డయానా బగ్నోలి తన కెమెరాలో బంధించడంతో బయటి ప్రపంచానికి ఈ ఆచారం గురించి తెలిసింది. అడవిలోకి అబ్బాయిలను పంపించే ముందు తొలుత వారిని సాంప్రదాయబద్దంగా అలంకరిస్తారు.

తర్వాత కొందరు గ్రామస్తులు వారి శారీరక దృఢత్వాన్ని నిరూపించుకునేందుకు కత్తులతో గాయపరుచుకోవడం ప్రారంభిస్తారు. వారి శరీర భాగాలను వారే కత్తులతో కోసుకుంటారు. ఆ సమయంలో ఒంటిపై అలంకరించిన ఆభరణాలను అలాగే ఉంచుతారు. అవి వారికి రక్షణ కవచంలా పనిచేస్తాయని చెబుతున్నారు.

గ్రామస్తులు ఇలా కత్తులతో ప్రదర్శన చేపట్టిన అనంతరం.. అడవిలోకి పంపించే అబ్బాయిలందరిని ఒక చోట కూర్చొపెట్టి గుండు గీస్తారు. ఇక అప్పటినుంచి వాళ్లు స్త్రీల ముఖం చూడటం, వారిని తాకడం నిషిద్దం. అలా వారంతా అడవిలోకి వెళ్లిపోయిన తర్వాత ఆడవాళ్లంతా ఒకచోట సమూహంగా నివసిస్తుంటారు.

నెలరోజుల పాటు అబ్బాయిలను అడవిలోకి పంపించడం ద్వారా వారు మరింత రాటుదేలి శక్తివంతులుగా మారుతారని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే కొన్నిసార్లు అడవిలోకి వెళ్లిన అబ్బాయిల్లో కొంతమంది ప్రమాదవశాత్తు మరణిస్తుంటారు కూడా.

అయినా సరే ఈ ఆచారాన్ని వారు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. తిరిగి అబ్బాయిలు గ్రామంలోకి వచ్చిన తర్వాత.. అందరిని ఓ గుడిసెలో ఉంచుతారు. ఆపై మహిళలంతా ఒక్కొక్కరిగా వచ్చి వారిని పరామర్శిస్తారు. అనంతరం వారిని గ్రామంలోకి తీసుకుని ఊరేగిస్తారు.

English summary
Boukout is a Diolá rite of passage practiced in the Ziguinchor region of Senegal, which inducts young men into society through a test of endurance and strength.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X