వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వంకు గ్రీన్ సిగ్నల్: ఇక ధర్మయుద్దమే, రేపు రచ్చరచ్చ !

జయలలిత మృతిపై అనుమానాలు నివృతి చెయ్యాలని, సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం బుధవారం చేపట్టనున్న ఉపవాస సత్యగ్రహానికి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సీబీఐతో విచారణ చేయించడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేపట్టదలచిన దీక్షకు ఆ రాష్ట్ర పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది.

ఎటువైపు అడుగు వేస్తున్నారు: కమల్ హాసన్ కథ ఏమిటి?ఎటువైపు అడుగు వేస్తున్నారు: కమల్ హాసన్ కథ ఏమిటి?

బుధవారం చెన్నైలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీలోని ఆయన వర్గంలోని నాయకులు ఉపవాస సత్యాగ్రం చెయ్యనున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపవాస సత్యాగ్రహం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Fast by Panneerselvam group seeking independent probe into formerr CM Jayalalithaa’s death

పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకులు కేపి. మునిసామి, నత్తం విశ్వనాథం, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్, జేసీడీ. ప్రభాకర్ తదితరులు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ జయలలిత మృతిపై అనుమానాలు నివృతి చెయ్యాలని రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంపై ఎటువంటి చర్యలు లేవని విచారం వ్యక్తం చేశారు.

శశికళ ఫ్యామిలీ వ్యాపారం రూ. 20 వేల కోట్లు: ఎందులోనో తెలిస్తే షాక్ !శశికళ ఫ్యామిలీ వ్యాపారం రూ. 20 వేల కోట్లు: ఎందులోనో తెలిస్తే షాక్ !

అన్నాడీఎంకే పార్టీ శశికళ కుటుంబ సభ్యుల కోరల్లో చిక్కుకుందని, మన్నార్ గుడి మాఫియా నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి తాము ధర్మయుద్దం చేపట్టామని చెప్పారు. సోమవారం రాత్రి పోద్దుపోయిన తరువాత డీజేపీ కార్యాలయం పన్నీర్ సెల్వం దీక్షకు అనుమతి ఇవ్వడంతో వేల సంఖ్యలో అమ్మ అభిమానులు ఉపవాస సత్యగ్రహం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

English summary
Rebel AIADMK leader O Panneerselvam’s faction today said it will observe one day fast in all district capitals across Tamil Nadu on March 8, seeking an independent probe into the demise of former Tamil Nadu chief minister Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X