వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్యాన్స్ వేసి ముద్దు పెట్టిన మామ, దుమ్ములేపేసిన వధువు

|
Google Oneindia TeluguNews

కాన్పూర్: సంతోషంతో చిందులు వేస్తున్న సమయంలో వరుడి తండ్రి వధువు సోదరికి ముద్దు పెట్టడంతో పెద్దరాద్దాంతం జరిగి దేహశుద్ది చేశారు. నయాపైసలతో సహ పెళ్లి ఖర్చులు చెల్లించిన వరుడి కుటుంబ సభ్యులు కాలికి బుద్ది చెప్పిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని ఈథా జిల్లా నెహ్రూనగర నివాసి రాజేష్, ఫరూఖాబాద్ జిల్లా నాగల్ ఖైర్ బాంద్ గ్రామానికి చెందిన రుచిల వివాహం నిశ్చయం అయ్యింది. మే 28వ తేది గురువారం రాత్రి ముహుర్తం నిర్ణయించారు. ముహూర్తానికి కొన్ని గంటల ముందు వరుడు, వధువు కుటుంబ సభ్యులు కళ్యాణ మంటపంలో ఉన్నారు.

ఆ సమయంలో జరిగిన జైమాల్ కార్యక్రమం (డ్యాన్స్ ప్రోగ్రామ్)లో ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు డ్యాన్స్ లు వేశారు. ఆ సందర్బంలో ఎవరికి వారు చిందులు వేస్తున్నారు. అదే సమయంలో వరుడు తండ్రి బాబురాంకు ఏమైయ్యిందో ఏమో పాపం పెళ్లి కుమార్తె సోదరిని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు.

Father in law kisses Young Women, bride returns baraat in uttar pradesh

ఈ సీన్ చూసి అక్కడ ఉన్న వారు షాక్ కు గురైనారు. అంతే వరుడి పక్కన కుర్చుని ఉన్న వధువు రుచి మెడలోని పూల దండను లాగి ముక్కలు ముక్కలు చేసి బాబురాం ముఖం మీద కొట్టింది. నీలా అసభ్యంగా ప్రవర్థించే నీచుల కుటుంబంలోకి కోడలుగా రానని తేల్చి చెప్పింది.

అప్పటికే అగ్గి మీద గుగ్గిలంలా ఉన్న వధువు కుటుంబ సభ్యులు, బంధువులు బాబురాంను పట్టుకుని దేహశుద్ది చేశారు. బాబురాంతో పాటు వరుడు రాజేష్ ను కళ్యాణమంటపంలోనే కట్టేశారు. పెళ్లి ఇంతటితో ఆగిపోయిందని వధువు రుచి తేల్చి చెప్పింది. వరుడితో పాటు అతని బంధువులను చితకబాదారు.

పెళ్లి ఖర్చులు మొత్తం కట్టించాలని రుచి కుటుంబ సభ్యులు చెప్పారు. అందుకు వరుడు రాజేష్, అతని తండ్రి బాబురాం అంగీకరించారు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అయితే అప్పటికే రాజీ జరిగిపోవడంతో పోలీసులు వెనుతిరిగారు.

పెళ్లి ఖర్చులు మొత్తం చెల్లించిన వరుడు రాజేష్ కుటుంబ సభ్యలు అక్కడి నుండి వెనుతిరిగారు. పెళ్లి మండపంలో ఇలా బరితెగించి ప్రవర్తించిన ఆ కుటుంబంలోకి కోడలుగా వెళ్లినా రుచి చాల కష్టాలు పడేదని, మంచి పని జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

English summary
The marriage of Ruchi, daughter of Parmeshwari Dayal from Nagla Khairband village in Farrukhabad, was fixed with Rajesh, son of Baburam from Nehru Nagar of Jaithara in Etah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X