వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరొకరితో జీవనం: మాజీ భర్త పరిహారం ఎందుకు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విడాకులు తీసుకున్న తర్వాత మనోవర్తి కోసం కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసిన గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త నుంచి విడిపోయిన తర్వాత ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి జీవిస్తుంటే, ఇక మనోవర్తి ఎందుకంటూ ప్రశ్నించింది.

అయితే ఈ కేసులో మైనర్‌గా ఉన్న పాపకు మాత్రం తండ్రి నుంచి పోషణ ఖర్చులు చెల్లించాల్సిందేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. మూడో వ్యక్తితో కలిసి జీవనం చేస్తుంది కాబట్టి అ మహిళకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది.

Few unwitting lapses not adultery: Gujarat HC

పటాన్ జిల్లాకు చెందిన ఈ కేసు హైకోర్టు బెంచ్‌కు రాగా విచారించింది. అంతక ముందు ఈ కేసు విచారణ సెషన్స్ కోర్టులో జరగ్గా తీర్పు మహిళకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో తన మాజీ భార్య మరోకరితో సెక్సువల్ రిలేషన్‌షిప్ పెట్టుకుందని సాక్ష్యాలను చూపాడు.

దీంతో మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే "తెలియకుండానో లేదా అనుకోని పరిస్థితులు ఎదురైన సమయంలోనో ఒక రాత్రి తప్పు జరిగితే దాన్ని లైంగిక బంధం కింద పరిగణనలోకి తీసుకోలేం. కానీ, అదే బంధం శాశ్వతంగా నడుస్తుంటే మాత్రం దాన్ని గురించి ఆలోచించాల్సిందే" అని హైకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు.

English summary
Gujarat high court has upheld a lower court's definition of adultery, where it said that a couple of lapses in behaviour, if they are unwitting, cannot be called adultery. However, a singular premeditated act of sexual intercourse by one spouse with another person would be adultery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X