వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరసేవకులపై ఫైరింగ్ పొరపాటే, కానీ: ములాయం

|
Google Oneindia TeluguNews

లక్నో: అయోధ్యలో రామాలయం ఉద్యమం సమయంలో కరసేవకుల పైన పోలీసుల ఫైరింగ్‌కు ఆదేశాలు బాధాకరమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ శనివారం నాడు అన్నారు. 27 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత ములాయం‌ తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

1991లో కరసేవకులపై కాల్పులకు ఆదేశాలివ్వడం తప్పేనని చెప్పడం గమనార్హం. దేశ సమైక్యత కోసం ఆ పని చేయక తప్పలేదన్నారు. ఆ ఆదేశాలివ్వడం తప్పేనని మాత్రం ఆయన అంగీకరించారు. అయోధ్యలో కరసేవకులను అదుపు చేసేందుకు అప్పట్లో ముఖ్యమంగా ఉన్న ములాయం కాల్పులకు ఆదేశాలిచ్చారు.

Firing on kar sevaks was sad but needed: Mulayam Singh Yadav

ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పదహారు మంది చనిపోయారు. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై శనివారం ములాయం మాట్లాడుతూ.. 'కర సేవలకులపై కాల్పులకు ఆదేశాలివ్వడం పొరపాటే. ముస్లింలను కాపాడేందుకు మరోమార్గం లేక అలా చేయాల్సి వచ్చింది. నిజానికి దేశంలోని మైనారిటీలు, ముస్లింల విశ్వాసం పొందేందుకు ఇది ఉపకరిస్తుందనుకున్నా' అని పేర్కొన్నారు.

English summary
Samajwadi Party president Mulayam Singh Yadav on Saturday said he feels “sad” about ordering police firing on ‘kar sevaks’ during the Ram temple movement in Ayodhya, but it was necessary to save a religious place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X