వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ చరిత్రలోనే తొలిసారిగా ఇలా జరగబోతోంది..

కేసు విచారణ సమయంలో రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురు వ్యక్తులు.. రంజిత్ ను ఆయన నివాసంలో కలిసినట్టుగా ఆరోపణలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన ఓ వ్యక్తిని సీబీఐ చీఫ్ విచారించనుండటం దేశ చరిత్రలో తొలిసారిగా చోటు చేసుకోనుంది. బొగ్గు కుంభకోణం విచారణలో మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా పాత్రపై పలు అభియోగాలు ఉండటంతో ఆయనపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సోమవారం నాడు సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేయగా.. రంజిత్ ను విచారించబోయే సీబీఐ టీమ్ కు అలోక్ వర్మ నేత్రుత్వం వహించనున్నారు. కాగా, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొగ్గు కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి.

 For First Time, CBI Chief Will Investigate The Man Who Headed It Earlier

కేసు విచారణ సమయంలో రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురు వ్యక్తులు.. రంజిత్ ను ఆయన నివాసంలో కలిసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా అప్పట్లో రంజిత్ ప్రయత్నించారని సుప్రీం కోర్టు గతంలో నియమించిన దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించింది.

English summary
Ranjit Sinha, who headed the country's premier investigating agency, will himself be the focus of an enquiry to ascertain whether he misused his power, the Supreme Court said today. Mr Sinha, as CBI chief, met at his home with several of the suspects accused of corruption and bribe-giving in the allocation of coal fields to private firms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X