చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

చైన్నై: సముద్రంలో చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని మనల్‌మేల్‌కుడి కృష్ణరాజపట్టినం చేపల రేవు నుంచి 200 మంది నాటు పడవల్లో చేపలు పట్టేందుకు మంగళవారం వెళ్లారు.

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది

రేవు నుంచి సుమారు 10 నాటికల్ మైళ్ల దూరం వెళ్లి చేపలు పడుతున్న సమయంలో తమ వలలో ఏదో బరువైన చేప చిక్కిందని తెలుసుకున్న మహమ్మద్, సుల్తాన్ అనే జాలర్లు దాన్ని అతి కష్టం మీద పైకి లాగారు.

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది

తమ వలలో పడిన ఎరుపు రంగు పల్సర్ బైక్‌ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ విషయం గురించి సముద్ర తీర భద్రతాదళానికి సమాచారం అందించారు.

 అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది

బైకుకు నెంబర్ ప్లేట్ లేదని గమనించిన పోలీసులు అక్రమ రవాణా కోసం దీనిని తీసుకువస్తూ, గస్తీ దళాలను చూసి ఎవరో సముద్రంలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది

అద్భుతం: చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బైక్‌ ఇంజన్, చాసిస్ నెంబర్ ఆధారంగా ఈ పల్సర్ బైక్ ఎవరిదన్న విషయాన్ని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

English summary
Fisherman got pulsar bike in sea at tamilnadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X