వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమమంటూ..! అమెరికాలో ఐదుగురు భారతీయుల అరెస్ట్

అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను, వారికి సహకరించిన ఒక కెనడా వాసిని యూఎస్‌ సరిహద్దు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే అమెరికాలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా, అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను, వారికి సహకరించిన ఒక కెనడా వాసిని యూఎస్‌ సరిహద్దు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వాషింగ్టన్‌లోని మోల్సన్‌ సమీపంలో అనుమతి లేకుండా సరిహద్దును దాటుతున్న వారిని అరెస్ట్‌ చేసినట్లు యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ పోలీసులు(సీబీపీ) తెలిపారు. భారతీయులకు సహకరించిన కెనడాకు చెందిన వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను ఇమ్మిగ్రేషన్‌ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
భారతీయులను తీసుకొచ్చిన కెనడావాసిని స్మగ్లింగ్‌ కేసులో అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు.

Five Indians, Canadian held for illegally entering US

యూఎస్‌లోకి ప్రవేశించిన తర్వాత అద్దె వాహనంలో వెళ్తున్న వారిని సరిహద్దు పోలీసులు అడ్డుకున్నారు. డ్రైవింగ్‌ చేస్తున్న కెనడా వాసికి, భారతీయులకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉండి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటున్న అధికారులను స్పోకేన్‌ సెక్టార్‌ పెట్రోల్‌ ఏజెంట్‌ చీఫ్‌ హెన్రీ రోలోన్‌ అభినందించారు.

అక్రమంగా దేశంలోకి ప్రవేశించే భారతీయుల సంఖ్య 2009 నుంచి 2014 వరకు 1,30,000 పెరిగినట్లు అక్కడి నివేదికలు చెబుతుండటం గమనార్హం. అక్రమ వలసదారుల్లో సుమారుగా 5లక్షల మంది భారతీయులు ఉన్నట్లు తాజా ప్యూ నివేదిక పేర్కొంది. అమెరికా తరలివస్తున్న అక్రమవలసదారుల్లో మెక్సికో, ఎల్‌ సాల్వడోర్‌, గ్వాటెమాలా తర్వాత నాలుగోస్థానంలో భారత్‌ ఉందని ఈ నివేదిక వెల్లడిస్తోంది.

English summary
According to a recent Pew report, the number of unauthorised Indian immigrants in America grew by about 130,000 from 2009 to 2014, to an estimated 500,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X