వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అందమైన యువతు'లని ఫ్లిప్‌కార్ట్ మెయిల్, క్షమాపణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన సెక్సియెస్ట్ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది. మహిళా కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ పంపించిన ఈ మెయిల్ పైన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో క్షమాపణ చెప్పింది.

యువతులు అందంగా ఉంటే మరిన్ని విజయావకాశాలు లభిస్తాయని ఓ రీసెర్చ్ చెబుతోందని, యువతులు అందంగా కనిపిస్తే, వారివైపు చూస్తారని, వారు చెప్పేది వింటారని, అలా కనిపించేవారిలో నమ్మకం పెరుగుతుందని, ఇతరులను సైతం మోటివేట్ చేస్తారని పేర్కొంటూ... మహిళలను అందంగా చూపే దుస్తులపై 20 శాతం అదనపు రాయితీలు ఇస్తామని మెయిల్ పెట్టింది.

Flipkart apologises for sexist email

ఈ వ్యాఖ్యలు సమంజసం కాదని ఓ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ వ్యాఖ్యానించారు. దీనిపై వెల్లువెత్తుతున్న నిరసనలను కట్టడి చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు పునీత్ సోనీ స్వయంగా రంగంలోకి దిగారు. యన తన ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు.

ఈ మెయిల్ విషయమై తన దృష్టికి రాలేదని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని మరో మెయిల్ పంపుతామని ఆయన తెలిపారు. ఈ తరహా ఘటనలు మరోసారి జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

English summary
Indian e-commerce major Flipkart has been caught in the middle of a tweetstorm following a promotional email sent to female customers featuring text that appears to be sexist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X