ఫ్లిప్ కార్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: స్పోర్ట్స్ ఆడండి.. మేం డబ్బులిస్తాం!

Subscribe to Oneindia Telugu

ముంబై: తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. 'బడ్డింగ్ స్టార్ ప్రోగ్రామ్' పేరుతో ఉద్యోగులు తమకు నచ్చిన జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తోంది.

ఇందుకోసం వారికి రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ఆఫర్ చేస్తుండటం విశేషం. దీనికోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఉద్యోగులు కంపెనీలో తప్పనిసరిగా 6నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. వచ్చిన దరఖాస్తులను ఇంటర్నల్ కంపెనీ ప్యానల్ షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

 Flipkart to promote staff participation in talent meets with Rs 3 lakh assistance

ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులను వారం రోజుల్లో పరిశీలించి, వాటికి ఆమోదం లభించిన ఐదు రోజుల్లోనే ఆర్థిక సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తోంది. రోజు వారీ ఉద్యోగ విధులు కాకుండా.. ఉద్యోగుల ప్రతిభను వెలికితీయడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఫ్లిప్ కార్ట్ డైరెక్టర్ టోటల్ రివార్డ్స్ సతీష్ కేవీ తెలిపారు.

పని ప్రదేశంలో ఉద్యోగులను సంతోషంగా ఉంచడం ద్వారా తమ ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్, నాన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఉద్యోగులు పాల్గొనవచ్చని అన్నారు. స్థానిక లేదా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు మాత్రం ఇది వర్తించదని తెలిపారు.

Flipkart Tied Up With eBay - Oneindia Telugu

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Flipkart, the country’s largest e-commerce marketplace, has launched a ‘Budding Star Programme’ through which its employees may seek financial assistance up to Rs 3 lakh to participate in any national or international competition in their area of interest.
Please Wait while comments are loading...