వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యులు కూడ విమానంలో చక్కర్లు కొట్టొచ్చు

By Narsimha
|
Google Oneindia TeluguNews

డిల్లీ: ఇక నుండి విమానంలో ప్రయాణం చేయడం కూడ అతి చౌకే. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ పథకం ప్రారంభం కానుంది. దేశంలోని చిన్న నగరాలకు ప్రయాణీకులను చేరవేసే విధంగా కేంద్రప్రభుత్వం ఉఢాన్ అనే పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం కింద తొలి విమానం వచ్చే ఏడాది జనవరిలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ...గంటకు 5 వేల రూపాయాలను వసూలు చేయనున్నారు.హెలిక్యాప్టర్ కు అరగంటకు 2500 రూపాయాలను వసూలు చేయనున్నారు.

విమాన ప్రయాణం వ్యయంతో కూడుకొన్నదని భావించే వారికి....మోడీ ప్రభుత్వం తీపి కబురును అందించింది. విమానంలో ప్రయాణం ఇక చౌకగా మారనుంది..సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉడాన్ (ఉడే డేస్ కా ఆమ్ నాగరిక్) అనే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.ఈ పథకం కింద విమాన టిక్కెట్ట ధరను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూంటారు.ప్రధాన రూట్లలో ప్రతి డిపార్చర్ కు చిన్న మొత్తంలో లెవీ విధించాలన్న విషయంై నెలాఖరులోపుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రయాణీకుల లెవీ విధిస్తే ఒక్కో టిక్కెట్టు పై అదనంగా 60 రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది.

aeroplane

వచ్చే ఏడాది జనవరి నుండి ఉడాన్ స్కీమ్ కింద కనీసం 30 ఎయిర్ పోర్ట్ లను రీజినల్ ఫ్లెయిట్ ను రీసివ్ చేసుకొనేలా తీర్చదిద్దాలని కేంద్రం సంకల్పించింది.సామాన్యులు విమనం టిక్కెట్టును కొనుగోలు భరించేలా టిక్కెట్టు ధరలను నిర్ణయించనుంది కేంద్రం. అదే సమయంలో విమానాలను నడిపే రీజినల్ ఆపరేట్లకు కూడ లాభం కలిగేలా చర్యలను తీసుకోనుంది.ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది ప్రభుత్వం.సక్సెస్ పుల్ ఆపరేటర్లకు మూడేళ్ళపాటు రీజినల్ ప్లయిట్లను నడిపేలా అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం.

విమానానికి గంటలోపు ప్రయాణానికి 2,500 రూపాయాలను వసూలు చేసే అవకాశం ఉంది. హెలిక్యాప్టర్ కు మాత్రం అరగంటకే రూ.2500 వసూలు చేయనున్నారు.గంటకు 5 వేలను హెలిక్యాప్టర్ లో ప్రయాణం చేస్తే వసూలు చేయనున్నారు.వారంలో కనిష్టంగా మూడు...గరిష్టంగా 7 విమానాలు తిరిగేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ పథకం కింద సామాన్యులు కూడ విమానంలో చక్కర్లు కొట్టే అవకాశం దక్కనుంది.

English summary
fly inter states in India cheap on Jan 2017. central govt introduced Udan scheme.common people will fly in to inter state citis an aeroplane around rs,2500 only. If fly helicoptor is also available .but charges high than an aeroplane .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X