వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నికలు: బీజేపీకి షాకిచ్చిన శివసేన, శరద్‌ పవార్‌ కు మద్దతు

ఎన్డీయే మిత్రపక్షంగా ఉంటూనే.. సందర్భం వచ్చినప్పుడల్లా పేచీలు పెడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బాహాటంగా విమర్శించే శివసేన మరోసారి బీజేపీకి షాక్ ఇచ్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శివసేన స్టయిలే వేరు. మిత్రపక్షంగా ఉంటూనే అది ఒక్కోసారి షాక్ ఇస్తూ ఉంటుంది. ఇప్పడు కూడా అదే జరిగింది. ఎన్డీయే మిత్రపక్షంగా ఉంటూనే.. సందర్భం వచ్చినప్పుడల్లా పేచీలు పెడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బాహాటంగా విమర్శించే శివసేన మరోసారి బీజేపీకి షాక్ ఇచ్చింది.

శివసేన తాజాగా రాష్ట్రపతి పదవికి ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ పేరును ప్రతిపాదించింది. అంతేగాక బీజేపీ కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరింది. అన్ని అర్హతలు ఉన్న బలమైన అభ్యర్థి రాష్ట్రపతి కావాలని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ చెప్పారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం వచ్చే జూలైలో ముగియనుంది.

మొన్న అలా.. ఈరోజు ఇలా..

మొన్న అలా.. ఈరోజు ఇలా..

ఇటీవల ఎన్డీయే నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందులో పాల్గొన్న శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఇంతలోనే ఆ పార్టీ మాట మార్చి శరద్‌ పవార్‌ పేరును తెరపైకి తీసుకురావడం గమనార్హం.

గతంలోనూ ఇలాగే...

గతంలోనూ ఇలాగే...

శివసేన గతంలోనూ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకించింది. గత రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ బలపరచిన అభ్యర్థికి శివసేన మద్దతు పలికింది. ప్రస్తుతం బీజేపీ, శివసేనల మధ్య సత్సంబంధాలు లేవు. మహారాష్ట్రలో ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా నిత్యం ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నాయి.

ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి...

ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి...

బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని ఒకేతాటిపైకి రావాలన్న ప్రతిపాదనలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నాయి.

బీజేపీకి ఇది ఇబ్బందికరమే...

బీజేపీకి ఇది ఇబ్బందికరమే...

పవార్‌ అభ్యర్థిత్వం పట్ల కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు, జేడీ(యూ) సుముఖంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన శివసేన కొత్త ప్రతిపాదన తీసుకురావడం బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. ఉద్దవ్‌ ఠాక్రే, పవార్‌ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారు.

ఇంతకుముందేమో మోహన్‌ భగవత్‌..

ఇంతకుముందేమో మోహన్‌ భగవత్‌..

శివసేన ప్రతిపాదనపై ఇంకా ఎన్సీపీ స్పందించలేదు. శివసేన ఇంతకుముందు రాష్ట్రపతి పదవికి ఆర్‌ఎస్ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పేరును ప్రతిపాదించింది. అయితే ఈ పదవికి తాను రేసులో లేనని భగవత్‌ ప్రకటించారు.

మరి బీజేపీ ఏం చేస్తుందో...

మరి బీజేపీ ఏం చేస్తుందో...


శివసేన వైఖరితో విసిగిన బీజేపీ మహారాష్ట్రలో శరద్‌ పవార్‌కు దగ్గర కావాలని భావిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పవార్‌ను దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవికి శివసేన పవార్‌ పేరు ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది.

English summary
NEW DELHI: Sharad Pawar for President is the Shiv Sena's latest suggestion and it wants ally BJP to back the Nationalist Congress Party chief too. Mr Pawar, said the Shiv Sena's Sanjay Raut today, is a "worthy leader and has the right credentials" to become the country's next President in July when the term of President Pranab Mukherjee ends. Mr Pawar's name has also figured as a likely consensus candidate in talks that opposition parties like the Left, Congress and Nitish Kumar's Janata Dal (United) are now holding to challenge the nominee of the BJP-led National Democratic Alliance or NDA for President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X