వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కానింగ్ కష్టాలు: చీరెలు, మంగళసూత్రాలుంటే స్కానర్లు పనిచేయడం లేదు

చీరెలు, మంగళసూత్రాలు ఉంటే ఎయిర్ పోర్ట్ లో కష్టమే అని అధికారులు చెబుతున్నారు. బాడీ స్కానింగ్ పరికరాలు చీరెలు, మంగళసూత్రం ఉంటే సక్రమంగా పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఎయిర్ పోర్ట్ ల్లో రక్షణ చర్యలు తీసుకొనేందుకు ఉపయోగించే స్కానర్లు భారతీయ మహిళలు ధరించే చీరెలు, మంగళసూత్రాలతో పూర్తి స్థాయిలో స్కానింగ్ చేయడం లేదు. చీరెలపై ఉన్న బారీ వర్క్ కూడ స్కానింగ్ కు ఇబ్బందులను కల్గిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త రకం స్కానింగ్ పరికరాలను దిగుమతిచేసుకొంటుంది విమానాయానశాఖ.

ఎయిర్ పోర్ట్ ల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తోన్న స్కానర్ల కంటే ఇంకా అత్యాధునికమైన స్కానర్లను విమానాశ్రయాల్లో ఉపయోగించాలని తలపెట్టింది.

టెర్రరిస్టుల దాడులను నిరోధించడంతో పాటు ఎయిర్ పోర్ట్ లద్వారా అక్రమంగా వస్తువులను తరలించకుండా ఉండేందుకుగాను అత్యంత అత్యాధునికమైన స్కానర్లను ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్కానర్ల ద్వారా అనుకొన్న మేరకు ప్రయోజనాలు లేవని ప్రభుత్వం భావిస్తోంది. దరిమిలా విదేశాల నుండి అత్యాధునికమైన స్కానర్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది.

చీర, మంగళ సూత్రం ఉంటే స్కానింగ్ కష్టమే

చీర, మంగళ సూత్రం ఉంటే స్కానింగ్ కష్టమే

ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్కానర్ల వల్ల చీర, మంగళసూత్రం ఉంటే స్కానింగ్ వల్ల ప్రయోజనం లేకుండాపోయిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ లో ఈ సమస్య ఎక్కువగా అధికారులు ఎదుర్కొంటున్నారు. భారతీయ మహిళలు ధరించే చీరలు మడతలు మడతలుగా ఉంటాయి.కొందరైతే ఈ చీరెలపై భారీగా వర్క్ చేయిస్తారు. ఈ వర్క్ మెటల్ తో ఉంటుంది. దీని కారణంగా స్కానింగ్ పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదంటున్నారు. అధికారులు, మంగళసూత్రం తీయడానికి కూడ మహిళలు ఒప్పుకోవడం లేదు. మంగళసూత్రం వల్ల కూడ స్కానింగ్ సక్రమంగా కావడం లేదని అధికారులు చెబుతున్నారు.

కొత్త తరహ బాడీ స్కానర్ల కోసం అధికారుల ప్రయత్నాలు

కొత్త తరహ బాడీ స్కానర్ల కోసం అధికారుల ప్రయత్నాలు

ప్రస్తుతం ఉన్న స్కానింగ్ పరికరాల వల్ల ప్రయోజనం లేదని భావించిన అధికారులు కొత్త తరహ పరికరాలన ఉపయోగించాలని భావిస్తున్నారు ఈ మేరకు అమెరికా కంపెనీ తయారు చేసిన బాడీ స్కానర్ ను ఉపయోగించారు. ఈ స్కానర్ వల్ల కూడ ఉపయోగం లేకుండాపోయింది. జర్మనీ తయారు చేసిన స్కానింగ్ పరికరాన్ని పరీక్షించాల్సి ఉంది.

 ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు కు రంగం సిద్దం

ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు కు రంగం సిద్దం

పుల్ బాడీ స్కానర్లను భారత్ లోని ఎయిర్ పోర్ట్ లలో ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.ఈ మేరకు విమానాయానశాఖాధికారలుు స్కానింగ్ పరికరాల కొనుగోలు కోసం కోటేషన్లు పిలిచారు. అమెరికన్, జర్మనీ కంపెనీలు తమ స్కానింగ్ పరికరాలను పంపాయి. జర్మన్ స్కానింగ్ పరికరం ఏ రకంగా పనిచేస్తోందోననే విషయాన్ని చూడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

స్కానర్లు ఎందుకు పనిచేయడం లేదంటే?

స్కానర్లు ఎందుకు పనిచేయడం లేదంటే?

భారతీయ మహిళలు ధరించే చీరల తో స్కానర్లు పనిచేయడంలేదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. చీరె కట్టుకోవడం భారతీయుల సంప్రదాయం. అయితే ఈ సంప్రదాయం కారణంగా చీరలో పలు మడతలు ఉంటాయి. ఈ మడతల గుండా స్కానింగ్ చేయలేకపోతున్నాయని భద్రత బలగాలు చెబుతున్నాయి.మంగళసూత్రాల గుండా స్కానింగ్ పరికరాలు స్కానింగ్ చేయలేకపోతున్నాయి. మంగళసూత్రాలను స్కానింగ్ చేసే సమయంలో తీయడానికి మహిళలు ఒప్పుకోవడం లేదు. చీరెలు, మంగళసూత్రాలున్న మహిళలను అమెరికన్ స్కానర్లు సక్రమంగా స్కానింగ్ చేయడం లేదని అధికారులు చెబుతున్నారు.

శరీరంపై మెటల్ వస్తువులు తొలగించాలి

శరీరంపై మెటల్ వస్తువులు తొలగించాలి

స్కానింగ్ చేసే సమయంలో శరీరంపై ఉన్న మెటల్ వస్తువులను తొలగించాల్సిందే. మెటల్ వస్తువులు ఉంటే స్కానింగ్ సక్రమంగా కాదు. అయితే పురుషులు స్కానింగ్ సమయంలో బెల్టులు, వ్యాలెట్ లను తీసివేస్తున్నారు. చీరకట్టుకొన్న మంగళసూత్రం తీయాలంటే మహిళు ఒప్పుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.భారీ మెటల్ వర్క్ ఉన్న చీరెలు మహిళలు ధరిస్తే స్కానింగ్ పనిచేయడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.పుల్ బాడీ స్కానింగ్ కోసం నియమనిబంధనల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడ లేకపోలేదు.

English summary
for security reasons latest body scanners will establish in airports, scanner are not identify saries and mangalasutra,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X