వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2,200కోట్లకు టోపీ: యుఎస్‌లో ఆస్తలు జప్తు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: దేశంలోనే అతి పెద్ద వంచన కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందడుగు వేసింది. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి విదేశాలలో ఆస్తులు సంపాదించిన సంస్థ మీద కఠిన చర్యలు తీసుకుంది. మొదటి సారి విదేశాలలలో ఉన్న రూ.1,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

అహ్మదాబాద్ లోని జూం డెవలపర్స్ సంస్థ కార్యాలయం ఉంది. ఈ సంస్థ నిర్వహకులు వివిధ చోట్ల వ్యాపారాలు చేస్తున్నామని అనేక బ్యాంకులలో రుణం తీసుకున్నారు. తరువాత రుణం తీసుకున్న నగదు వాయిదాల పద్దతిలో తిరిగి చెల్లించకుండా కాలం వెల్లదీశారు.

చాల రోజులు ఆ సంస్థ చుట్టు తిరిగిన బ్యాంకుల అధికారులు చివరికి విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసులు నమోదు అయ్యాయి. రంగంలోకి దిగిన ఈడీ జూం డెవలపర్స్ అమెరికాలోని కాలిఫోర్నియాలో రూ. వెయ్యి కోట్లు పెట్టి భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

For the first in its history, ED attached Property in California in US

అంతే కాకుండ అహ్మదాబాద్ లో జూం డెవలపర్స్ కు చెందిన 1,200 ఎకరాల భూములను గురువారం జప్తు చేశారు. కాలిఫోర్నియాలోని ఆస్తులను జప్తు చేసి విచారణ చేపట్టారు. వివిధ బ్యాంకులకు జూం డెవలపర్స్ రూ.2,200 కోట్లు కుచ్చుటోపి పెట్టింది.

ఈ విషయం సీసీబీ పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని అధికారులు తెలిపారు. విజయ్ చౌధరి కి చెందిన జూం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముంబై నగరంతో పాటు అనేక నగరాలలో తమ సంస్థ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. విజయ్ చౌధరి పరారిలో ఉన్నాడని అధికారులు తెలిపారు.

English summary
The total loan taken was of Rs 2,200 crore for carrying out various projects in the European countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X