వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలెక్టర్ తుపాకి గురి పెట్టిన మాజీ మంత్రి

|
Google Oneindia TeluguNews

చెన్నై: రైతుల సమస్యల పరిష్కార సమావేశంలో ఓ మాజీ మంత్రి హంగామా చేశారు. వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ కు తుపాకి గురి పెట్టి డీఎంకే హై కమాండ్ అగ్రహానికి గురై పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.

తమిళనాడులోని ధర్మపురి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యల పరిష్కార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్ వివేకానందన్ అధ్యక్షత వహించారు. సుమారు 500 మంది రైతులు పాల్గోన్నారు.

Former DMK Minister Mullaivendhan joins DMDK In Tamil Nadu

ఇదే సమావేశానికి తమిళనాడు మాజీ మంత్రి ములైవేందన్ హాజరైనారు. ఉచిత విద్యుత్, ప్రభుత్వ రాయితీలు అందడం లేదని, చెరువుల సమస్యలపై రైతులు మాట్లాడుతున్నారు. అధికారులు వారి సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారు.

అదే సందర్బంలో మాజీ మంత్రి ములైవేందన్ మాట్లాడుతూ మద్యలో బ్యాగ్ లో నుంచి రివాల్వర్ బయటకు తీసి కలెక్టర్ వివేకానందన్ కు గురి పెట్టారు. కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్న అధికారులు, రైతులు షాక్ కు గురైనారు.

మాజీ మంత్రి ములైవేందన్ మాట్లాడుతూ తన రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ చెయ్యాలని అర్జీ పెట్టుకున్నా ఇంత వరకు స్పందించలేనని అన్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వివేకానందన్ మీరు మొదట రివాల్వర్ లోపల పెట్టాలని, సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

మాజీ మంత్రి ములైవేందన్ డీఎంకే పార్టీ నాయకుడు. ఆయన తీరు పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆలోచించిన డీఎంకే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. తరువాత ములైవేందన్ డీఎండీకేలో చేరారు.

English summary
Mullaivendhan was elected to the Assembly from the Morappur constituency in 1989, 1996 and in 2006.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X