బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

300 మంది అమ్మాయిలతో..: కాశ్మీర్ మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

జమ్ము కాశ్మీర్ మాజీ మంత్రి అబ్దుల్ గని మాలిక్ తనయుడుగా చెబుతున్న హబీబ్ గనిని శనివారం బెంగళూరు మైకో లే అవుట్ పోలీసులు అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ మాజీ మంత్రి అబ్దుల్ గని మాలిక్ తనయుడుగా చెబుతున్న హబీబ్ గనిని శనివారం బెంగళూరు మైకో లే అవుట్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇంటర్వ్యూకు హాజరైన అమ్మాయిలపై అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో శనివారం అరెస్టు చేశారు.

గత నెల 15వ తేదీన బన్నేరుఘట్ట రోడ్డులోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ఉడుపి జిల్లాకు చెందిన యువతి ఇంటర్వ్యూకు హాజరయింది. అనంతరం ఆమె కంపెనీ నుంచి బయటకు వచ్చింది.

అమ్మాయి చేయి పట్టుకొని లాగాడు..

అమ్మాయి చేయి పట్టుకొని లాగాడు..

అక్కడే కారులో ఉన్న హబీబ్‌ గని ఆ అమ్మాయితో.. ఉద్యోగం కావాలంటే తన ఇంటికి రావాలన్నాడు. దీనికి ఆమె నిరాకరించడంతో నిందితుడు అమ్మాయి చేయి పట్టికొని కారులోకి లాగేందుకు ప్రయత్నించాడు.

300 మంది అమ్మాయిలకు వేధింపు

300 మంది అమ్మాయిలకు వేధింపు

ఈ ఘటనపై బాధితురాలు మైకోలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శనివారం హబీబ్ గనిని అరెస్ట్‌ చేశారు. నిందితుడు దాదాపు 300 మంది అమ్మాయిలను వేధింపులకు గురి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఫోన్ నెంబర్లు తస్కరించి

ఫోన్ నెంబర్లు తస్కరించి

గని ఓ ప్రయివేటు కాలేజీలో చదువుతున్నాడు. ఓ ప్రయివేటు కంపెనీలో కూడా ఉద్యోగం చేస్తున్నాడు. నిందితుడు తాను పని చేసే కార్యాలయంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అమ్మాయిల ఫోన్ నెంబర్లను రికార్డుల నుంచి తస్కరించాడు.

కలవాలని చెప్పాడు

కలవాలని చెప్పాడు

ఉడుపికి చెందిన బాధితురాలు ఫిర్యాదు మేరకు.. గని తన ఫోన్ నెంబర్ తీసుకొని, నిత్యం తనతో ఫోన్లో మాట్లాడాడని చెప్పింది. జాబ్ విషయమై హామీ ఇచ్చాడని, ఆ తర్వాత తనను కలవాలని చెప్పాడని తెలిపింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను వాహనంలో తీసుకెళ్లాడని, కారు వెళ్తుండగా తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది

ఉద్యోగం పేరుతో వేధింపులు

ఉద్యోగం పేరుతో వేధింపులు

ఈ ఫిర్యాదుతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. విచారణలో.. అతను చాలామంది అమ్మాయిలను ఇలా ఉద్యోగం పేరుతో వేధింపులకు గురి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దాదాపు 300 మంది అమ్మాయిలను అతను వేధించినట్లుగా గుర్తించారు.

English summary
The son of a former Kashmir minister has been arrested for sexually harassing women in Bengaluru. Habib Ghani, claiming to be the son of Kashmir's former Minister for Social Welfare Abdul Ghani has been arrested for preying on vulnerable women who attended job interviews and sexually abusing them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X