వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్ధాన్ మాజీ సీఎంకు స్వైన్ ప్లూ, బీజేపీపై ఆరోపణలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జైపూర్: భారతదేశంలో స్వైన్ ప్లూ మరింతగా విజృంభిస్తుంది. తాజాగా, రాజస్ధాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు స్వైన్ ప్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు పరీక్షలు నిర్వహించగా ఫలితం పాజిటివ్ అని తేలింది. ఆయన రక్త నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం ఢిల్లీ పంపించారు.

తన ఆరోగ్య పరిస్ధితిపై ఆదివారం మాజీ ముఖ్యమంత్రి ట్విట్టర్లో స్పందించాడు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడంతో త్వరగా కోలుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, బీజేపీపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వైన్ ప్లూ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరైన అవగాహన కార్యక్రమలు చేపట్టం లేదని ఆరోపణలు చేశారు.

 Former Rajasthan CM Ashok Gehlot tests positive for swine flu

నివేదికల ప్రకారం రాజస్ధాన్‌లో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 1900 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉండగా, వారిలో 640 మందికి పాజిటీవ్‌ రిపోర్టు వచ్చింది.

మరోవైపు స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్సను అందిస్తున్న 19 మంది డాక్టర్లకు కూడా ఈ వ్యాధి సోకింది. స్వైన్‌ఫ్లూ కారణంగా శనివారం ఒక్కరోజే ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 45 మంది మృతి చెందారు.

English summary
Former Rajasthan chief minister Ashok Gehlot has tested positive for swine flu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X