వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకానంద స్వామిపై క్విజ్: ముస్లీం అమ్మాయిలు టాప్ ఫోర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: స్వామి వివేకానందపై నిర్వహించిన క్విజ్‌ పోటీలో నలుగురు ముస్లిం బాలికలు టాపర్స్‌గా నిలిచారు. రామకృష్ణ మఠం నిర్వహించిన ఈ క్విజ్‌ పోటీలో గుజరాత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 74,529 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

చివరికి రెహానా రహీం, యశ్రాబాను మాస్టర్‌, జీల్బాను ముల్తాని, మరియంఖాటు అస్లాం ఖాన్‌ అనే ముస్లిం బాలికలు టాప్‌లో నిలిచారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనంది బెన్‌ పటేల్‌ సోమవారం వడోదరలో టాప్‌లో నిలిచిన వీరికి బహుమతులు అందజేశారు.

Four Muslim girls top Swami Vivekananda quiz contest in Gujarat

ప్రతి విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడే స్ఫూర్తిదాయ పుస్తకాలు చదవాలని ఈ సందర్భంగా ఆనందీ బెన్ పటేల్ పిలుపు ఇచ్చారు. పాకెట్‌ మనీ కోసం తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులతో అలాంటి పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మన క్యారెక్టర్ నిర్మాణం ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. స్ఫూర్తినిచ్చే పుస్తకాలు ఎప్పుడు చదవాలన్నారు.

కాగా, గెలుపొందిన రెహానా రహీమ్ జునాగఢ్ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని. యశ్రాబాను మాస్టర్ అహ్మదాబాదులోని హెచ్‌బీకే న్యూ స్కూల్ విద్యార్థని. జీల్బాను ముల్తానీ అమ్రేలీలోని జేఎన్ మెహ్రా హైస్కూల్ విద్యార్థిని. మరియంఖాటు అస్లాం ఖాన్ వల్సాద్‌లోని గంగా స్కూల్ విద్యార్థిని.

English summary
Four Muslim girl students have emerged as toppers in a written quiz competition held on Swami Vivekananda in Gujarat. Felicitating the students on the occasion, state Chief Minister Anandi Patel said students must read inspirational books for building their character which will eventually help in building the nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X