వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారెవా.. పాలపుంతలోని గ్రహానికి బెంగళూరు అమ్మాయి పేరు!

పదహారేళ్లకే బెంగళూరు అమ్మాయి సాహితి పింగళి అరుదైన గౌరవం దక్కించుకుంది. నీటి నాణ్యతను పెంచే దిశగా ఆమె చేసిన కృషికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైన్స్ అవార్డు దక్కడంతోపాటు విశ్వంలోని ఓ చిన్న గ్రహానికి ఆమె

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పదహారేళ్లకే బెంగళూరు అమ్మాయి సాహితి పింగళికి అరుదైన గౌరవం దక్కింది. నీటి నాణ్యతను పెంచే దిశగా ఆమె చేసిన కృషికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైన్స్ అవార్డు దక్కడంతోపాటు విశ్వంలోని ఓ చిన్న గ్రహానికి ఆమె పేరు పెట్టారు.

సాహితి ప్రస్తుతం పన్నెండో తరగతి చదువుతోంది. ఈనెల మొదట్లో లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్ లో పాల్గొంది. 'ఇన్నోవేటివ్ గ్రౌండ్ సోర్స్ అప్రోచ్ టు మానిటరింగ్ ఫ్రెష్ వాటర్ బాడీస్' అనే అంశంపై సాహితి చేసిన పరిశోధనకు గోల్డ్ మెడల్ దక్కింది.

From Bengaluru to the Milky Way—how this 12th grader got a planet named after her

మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లోని లింకన్ ల్యాబొరేటరీకి విశ్వంలోని చిన్న గ్రహాలకు పేర్లు పెట్టే హక్కలున్నాయి. ఈ సైన్స్ ఫెయిర్ లో భారతీయులకు మొత్తం 21 అవార్డులు దక్కగా అందులో మూడు సాహితి పింగళికి దక్కడ విశేషం.

ఎర్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ సైన్సెస్ కేటగిరీలో మొత్తంగా సాహితి ద్వితీయ స్థానంలో నిలిచింది. 'నేనిది ఊహించలేదు, ఒక్క స్పెషల్ అవార్డు మాత్రమే నేను వస్తుందనుకున్నా..' అంటూ సాహితి సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈమె యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ లో ఇంటర్న్ షిప్ చేస్తోంది.

English summary
A 12th-grade student who presented an award-winning paper on how to tackle those little specks of froth that are manifestations of the pollutants in our lakes now has a little speck in the infinite universe named after her. Meet Sahithi Pingali, a student at Inventure Academy, Bengaluru. Here’s how she became one of the gifted few individuals whose roles in the advancement of the world led to minor planets in our galaxy, the Milky Way, being named after them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X