వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 1 నుంచి.. ఆన్ సైట్ ఏటీఎంలలో ఫుల్ క్యాష్!

ఏప్రిల్ 1 నుంచి సామాన్యుడి నగదు కష్టాలు తీరనున్నాయి. ఆన్ సైట్ ఏటీఎంలలో నగదు నిల్వలు పుష్కలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: బ్యాంకు పక్కనే ఏటీఎం ఉంటుంది. కానీ అందులో కూడా నగదు ఉండదు. ఏవిటీ ఖర్మ అనుకుంటున్నారా? జస్ట్ కొన్ని రోజులు ఓపిక పట్టండి చాలు.. మీ నగదు కష్టాలు తీరిపోతాయి. ఏప్రిల్ 1 నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతోంది.

దూరంగా ఉన్న ఏటీఎంల సంగతేమోకానీ, బ్యాంకు బ్రాంచి పక్కనే ఉండే ఏటీఎంలలో మాత్రం నగదు నిల్వలు పుష్కలంగా ఉంటాయి. అర్థరాత్రి అయినా, అమావస్య అయినా... ఏ సమయంలో అయినా సరే మీకు డబ్బు అవసరమైనా ఈ ఎటీఎంలనే ఎంచుకోండి.

నగదు కోసం సామాన్యుడు నేటికీ నానా తిప్పలు పడుతున్నాడు. రిజర్వ్ బ్యాంక్ నగదు విత్ డ్రాపై పరిమితి ఎత్తివేసినా ఎక్కడా పైసా పుట్టడం లేదు. చాలా ఏటీఎంల వద్ద 'నో క్యాష్' బోర్డు వేలాడుతూ సామాన్యుడిని వెక్కిరిస్తోంది.

కానీ ఏప్రిల్ 1 నుంచి మాత్రం ఇలా ఉండదు. ఎనీ టైం మనీ తీసుకోవచ్చు. ప్రతి బ్యాంకు బ్రాంచి వద్ద ఉండే ఏటీఎంలో వాటి సామర్థ్యానికి తగినట్టుగా నగదు నిల్వలు ఉంచాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు అందాయి. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి రాబోతోంది.

Full Cash in Onsite ATMS..from 1st April 2017

బ్యాంకుకు దూరంగా ఉండే ఏటీఎంలను ఆఫ్ సైట్ ఏటీఎంలని, బ్యాంకు బ్రాంచిని ఆనుకుని పక్కనే ఉండే ఏటీఎంలను ఆన్ సైట్ ఏటీఎంలని పిలుస్తారు. ఈ ఏటీఎంలలో నగదు నింపేందుకు ఒక్కో బ్యాంకు.. ఒక్కో ఏజెన్సీని నియమించుకుంది.

కానీ వచ్చే ఏప్రిల్ 1 నుంచి మాత్రం ఆన్ సైట్ ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతలను ఆయా బ్యాంకుల అధికారులే నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే బ్యాంకుల చెంత, బ్యాంకుల ప్రాంగణంలో ఉన్న ఏటీఎంల నిర్వహణ బాధ్యత బ్యాంకు అధికారులదే.

బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్... ఈ ముగ్గరూ సదరు ఆన్ సైట్ ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు చెలామణిలో ఉన్న సమయంలో ఒక్కో ఏటీఎంలో రూ.35 లక్షల నగదు పెట్టేవారు.

ఇప్పుడు రూ.2 వేల నోట్లు మార్కెట్లోకి వచ్చిన తరువాత ఈ సామర్థ్యం రూ.60 లక్షలకు పెరిగిందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఏటీఎం నుంచి ఒక్కో ఖాతాదారుడు రూ.50 వేలను డ్రా చేసుకున్నా 120 మంది వరకు డబ్బు తీసుకునే అవకాశముంటుంది.

నిల్వ రూ.5 లక్షలకు తగ్గగానే...

ప్రతి ఆన్ సైట్ ఏటీఎంలో రూ.60 లక్షల వరకు నగదు నింపొచ్చు. ఒకవేళ నగదు నిల్వ రూ.
5 లక్షలకు తగ్గిపోతే వెంటనే సదరు బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్ మొబైల్ ఫోన్లకు ఎస్సెమ్మెస్ వెళుతుంది.

అర్థరాత్రయినా, సెలవు దినమైనా సరే వారు వచ్చి బ్యాంకు తెరిచి, లాకర్లలో ఉన్న నగదు తీసి ఏటీఎంలో నింపాలి్స ఉంటుంది. నిజానికి ఈ విధానం ఇది వరకే అమలులోకి వచ్చింది కానీ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో దీనిని రద్దు చేశారు.

అయితే ఏటీఎంలలో నగదు నిల్వలు సరిపడా ఉండక సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మళ్లీ ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మరి ఈ విధానం అన్ని బ్యాంకులకు వర్తిస్తుందో లేదో స్పష్టం కానప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

English summary
Mumbai: Reserve Bank of India instructed all the banks to maintain cash in Onsite ATMs 24/7 from April 1 2017. Actually this was introduced long back but it was not implemented as the Unions of All Banks are against this method. But now, the RBI is taken a strict decession and all the banks are going to implement this method from 1st April 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X