వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యక్ష రాజకీయాలు: తేల్చి చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి: బళ్లారీకి దూరం అందుకేనా!

|
Google Oneindia TeluguNews

గదగ్/బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక పర్యటక శాఖ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా ? రారా ? అంటూ గత కొంత కాలంగా కర్ణాటకలో అందరూ చర్చించుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు గాలి జనార్దన్ రెడ్డి దూరంగా ఉంటారని ఇంత వరకు జోరుగానే ప్రచారం జరిగింది.

ఈ ఊహాగానాలకు తెర దించుతూ గాలి జనార్దన్ రెడ్డి సమాధానం చెప్పారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

150 సీట్లు, సీఎం అయ్యేది ఆయనే !

150 సీట్లు, సీఎం అయ్యేది ఆయనే !

మంగళవారం గదగ్ లో గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో రానున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 150 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయం సాదిస్తోందని జోస్యం చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారని గాలి జనార్దన్ రెడ్డి జోస్యం చెప్పారు.

బళ్లారీకి దూరం, కొత్త నియోజక వర్గం

బళ్లారీకి దూరం, కొత్త నియోజక వర్గం

తాను బీజేపీలో ఓ సామాన్య కార్యకర్త అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే గదగ్ నుంచి పోటీ చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి తానుకట్టుబడి ఉంటానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు. అయితే బళ్లారీ జిల్లా నుంచి పోటీ చెయ్యరాదని ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

జైలు జీవితం, కుమార్తె పెళ్లి

జైలు జీవితం, కుమార్తె పెళ్లి

అక్రమ గనుల కేసులో జైలు జీవితం గడిపిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తరువాత కుమార్తె పెళ్లి చేసిన గాలి జనార్దన్ రెడ్డి దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు తెరతీశారు.

అయోమయంలో గాలి, చివరికి ఇలా !

అయోమయంలో గాలి, చివరికి ఇలా !

కుమార్తె పెళ్లి తరువాత గాలి జనార్దన్ రెడ్డి తన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలా ? వద్దా ? అనే నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు ఇంతకాలం చెప్పారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్దంగా ఉన్నానని తేల్చి చెప్పారు.

అధిష్టానం చాన్స్ ఇస్తుందా ?

అధిష్టానం చాన్స్ ఇస్తుందా ?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప అశీస్సులు గాలి జనార్దన్ రెడ్డికి పుష్కలంగా ఉన్నాయి. అక్రమ గనుల వ్యవహారంలో జైలుపాలైన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తుందా ? లేదా ? అని వేచిచూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

English summary
Karnataka former minister (BJP) Gali Janardhan Reddy said he is likely to contest next Assembly Election from Gadag constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X