వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ కోసం ఈసీకి రక్తంతో లేఖ రాసిన బాలిక

సీఎం అఖిలేవ్ యాదవ్‌కే సైకిల్ గుర్తు కేటాయించాలంటూ ఉత్తరప్రదేశ్‌కి చెందిన 15 ఏళ్ల ఓ బాలిక ఎన్నికల సంఘానికి రక్తంతో లేఖ రాసింది.

|
Google Oneindia TeluguNews

ఘజియాబాద్: గత కొద్ది రోజులుగా సమాజ్‌వాదీ పార్టీ గుర్తు 'సైకిల్‌' కోసం ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య ఘర్షణ నడుస్తున్న విషయం తెలిసిందే. సైకిల్ గుర్తు తమకు కేటాయించాలంటే, తమకు కేటాయించాలని ఎన్నికల సంఘం చుట్టూ ఇరు పార్టీల నేతలు తిరుగుతున్నారు. ఓసారి సద్దుమణిగినట్లు కనిపిస్తున్న వివాదం, మరికాసేపటికి రాజుకుుంటోంది. దీంతో వీరి మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

ఇది ఇలా ఉండగా, సీఎం అఖిలేవ్ యాదవ్‌కే సైకిల్ గుర్తు కేటాయించాలంటూ ఉత్తరప్రదేశ్‌కి చెందిన 15 ఏళ్ల ఓ బాలిక ఎన్నికల సంఘానికి రక్తంతో లేఖ రాసింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఆమె.. తన సోదరుడితో కలిసి సిరంజితో రక్తం తీసుకుని ఉత్తరం రాసినట్టు బాలిక తండ్రి తెలిపారు. శుక్రవారమే దాన్ని పోస్టు చేద్దామని ప్రయత్నించగా తాను అడ్డుకున్నట్టు తెలిపారు.

రాజకీయ సంఘటనలకు ప్రభావితం కాకూడదని.. ముందు చదువుపై శ్రద్ధ చూపించాలని వారికి నచ్చజెప్పాను' అని ఆ బాలిక తండ్రి పేర్కొన్నారు. అయితే, ఆమెకు అఖిలేష్ అంటే చాలా ఇష్టమని చెప్పారు.

Ghaziabad girl writes to EC in blood, demands SP symbol for Akhilesh Yadav

'వాళ్లు తమకు ఫ్రీగా లాప్‌టాప్ రావాలని.. అందుకు అఖిలేశ్ దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటున్నారు. ఇటీవల మా ప్రాంతంలోని అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు ఓ వ్యక్తి రక్తంతో ఉత్తరం రాసినట్టు పత్రికల్లో చూసి తెలుసుకున్నారు. ఇప్పుడు వీళ్లుకూడా అదే తరహా లెటర్ రాసేందుకు నిర్ణయించుకున్నారు' అని వారి తండ్రి పేర్కొన్నారు.
పార్టీ కార్యకలాపాలకు అఖిలేశ్‌కి వదిలేయాలంటూ ఇదే లేఖను ములాయంకి కూడా పంపినట్టు తెలిపారు.

కాగా, ఇప్పటికే అఖిలేశ్‌పై, సైకిల్ గుర్తుపై ఈ పిల్లలు రాసిన పాటలు స్థానిక కార్యక్రమాల్లో పాడుకుంటుండటం గమనార్హం. ఇంతకుముందు అఖిలేష్ యాదవ్‌కే పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ ఓ ఎస్పీ యువనేత తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఇది ఇలా ఉండగా, ములాయం, అఖిలేష్ యాదవ్‌లకు జనవరి 9లోగా పార్టీలో బలాబలాలను నిరూపించుకోవాలని ఈసీ సూచించింది.

English summary
A 15-year-old girl in Ghaziabad wrote a letter in blood to the election commission, requesting the poll panel to award the Samajwadi Party election symbol to her idol and Uttar Pradesh chief minister Akhilesh Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X