వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం 'యోగి' ఎఫెక్ట్: హోటళ్లపై దాడులు.. అదుపులో 50జంటలు

ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంతంలో ఉన్న రెండు హోటళ్లపై భారీ ఎత్తున దాడులు నిర్వహించారు.

|
Google Oneindia TeluguNews

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. యూపీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోలీసులు పలు హోటళ్లపై దాడులు చేశారు. ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంతంలో ఉన్న రెండు హోటళ్లపై భారీ ఎత్తున దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో దాదాపు 50జంటలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హోటళ్లలో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న అనంతరం వారిని కొత్వాలీ స్టేషన్ కు తరలించారు.

ghaziabad police detain 50couples after raids in two hotels

దాడుల్లో పట్టుబడ్డ యువతీ యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి న్యాయపరమైన చర్యల గురించి వివరించారు. దాడులు నిర్వహించిన రెండు హోటళ్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ రెండు హోటళ్ల యజమానులు ఢిల్లీ-ఎన్సీఆర్ మార్గంలో కస్టమర్లను ఆకర్షించి గంటల చొప్పున గదులను అద్దెకిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోను ఈ హోటళ్లపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం యోగి ఆదిత్యానాథ్ పోలీసులకు పూర్తి స్వేచ్చనిట్లు సమాచారం.

English summary
The Ghaziabad senior superintendent of police (SSP) on Monday evening decided to remove the area circle officer and also suspended his driver and the local police-post in-charge on suspicion of aiding immoral activities in hotels in Bazaria market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X