వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ భాషలకు... గూగుల్ ఇండియా బొనాంజా

భారత దేశంలో వంద కోట్ల మందికి ఇంటర్నెట్‌ను చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో గూగుల్ ఇండియా ఉంది. ఇందులో భాగంగా మరో సరికొత్త ప్రయోగంతో ముందుకు వచ్చింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశంలో వంద కోట్ల మందికి ఇంటర్నెట్‌ను చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో గూగుల్ ఇండియా ఉంది. ఇందులో భాగంగా మరో సరికొత్త ప్రయోగంతో ముందుకు వచ్చింది. తాజాగా తొమ్మిది భాషల్లో న్యూరల్ మిషన్ ట్రాన్సులేషన్‌ను తీసుకు వచ్చింది.

ఇంటర్నెట్‌ను వంద కోట్ల మంది భారతీయులకు చేరువ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు గూగుల్ ఇండియా గతంలో ప్రకటించింది.

తాజాగా మంగళవారం నాడు భారతీయ భాషల్లో కొత్త ఆవిష్కరణలు తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఆన్ లైన్ వైపు వస్తున్న వారికి మరింత ఉన్నతమైన సేవలు ఉపయోగించేందుకు వీలుగా వీటిని తీసుకు వస్తున్నట్లు తెలిపింది. గూగుల్ - కేపీఎంజీ కలిసి 'ఇండియన్ లాంగ్వేజెస్-డిఫైనింగ్ ఇండియాస్ ఇంటర్నెట్' అనే పేరుతో ఆవిష్కరణను విడుదల చేసింది.

మంగళవారం.. అంటే ఏప్రిల్ 25, 2017 నుంచి గూగుల్ న్యూ న్యూరల్ మిషన్ ట్రాన్సులేషన్ టెక్నాలజీ ద్వారా భారత దేశంలోని తొమ్మిది భాషల్లో తర్జుమా కోసం వినియోగించవచ్చు.

Google’s Indian bonanza: Support to 22 Indian languages across products

ఇంగ్లీష్ నుంచి భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే హిందీ, బెంగాళీ, మరాఠీ, తమిళం, తెలుగు, గుజరాత్, పంజాబీ, మళయాళం, కన్నడ భాషలను ట్రాన్సులేట్ చేసుకోవచ్చు.

ఇప్పుడున్న ట్రాన్సులేషన్ సిస్టం కంటే కొత్తగా వచ్చిన న్యూరల్ ట్రాన్సులేషన్ ఎంతో ఉత్తమం. తాజా న్యూరల్ ట్రాన్సులేషన్‌తో పూర్తి వ్యాఖ్యం ఒకేసారి తర్జుమా అవుతుంది.

అలాగే, న్యూరల్ మిషన్ ట్రాన్సులేషన్‌ను క్రోమ్ బ్రౌజర్స్‌లోను వెబ్ కంటెంట్‌ను ట్రాన్సులేట్ చేస్తుంది. దీని ద్వారా పూర్తి పేజీ అనువాదాలు కచ్చితంగా, సులభంగా చదివేందుకు అనువుగా ఉంటుంది.

ఈ కొత్త ట్రాన్సులేషన్ వినియోగదారులకు గుగుల్ సెర్చ్, మ్యాప్స్‌లలోను ఉపయోగపడుతుంది. మనకు కావాల్సిన ప్రాంతాలను ట్రాన్సులేట్ చేసి అందించగలుగుతుంది. మొబైల్స్‌లలో, అలాగే డెస్క్ టాప్‌ల పైన కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త ట్రాన్సులేషన్ ఆవిష్కరణ ద్వారా రెస్టారెంటు నుంచి కేఫ్స్, హోటల్స్ వరకు అన్ని కూడా మనకు కావాల్సిన భాషలో కనిపిస్తాయి. వినియోగదారుడు తనకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చూసుకోవచ్చు.

'ఇండియన్ లాంగ్వేజెస్ - డిఫైనింగ్ ఇండియాస్ ఇంటర్నెట్' గురించి గుగుల్ - కేపీఎంజీ ఇండియా వీపీ రాజన్ ఆనందన్, ఇండియా & సౌత్ ఈస్ట్ ఏసియా, గూగుల్ మాట్లాడారు. ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారికి, మరింత మందికి చేరువయ్యేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అర్థవంతంగా ట్రాన్సులేట్ చేస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం భారత దేశంలో అన్ని భాషల్లో కలిపి 234 మిలియన్ల యూజర్స్ ఉన్నారని, మరో నాలుగేళ్లలో 600 మిలియన్ల భారీతీయులు ఇంటర్నెట్ వినియోగిస్తారని చెప్పారు.

ఇప్పుడు తాము లాంచ్ చేసిన న్యూరల్ మిషన్ ట్రాన్సులేషన్ మంచి ముందడుగు అన్నారు. దీని ద్వారా మరింతమంది ఆన్ లైన్ వైపు వస్తారని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

* ప్రస్తుతం భారత దేశంలో 234 మంది మిలియన్ ఆన్ లైన్ యూజర్స్ ఉన్నారు. అదే సమయంలో 175 మిలియన్ల ఇంగ్లీష్ యూజర్స్ ఉన్నారు.

* ఇంటర్నెట్ వినియోగించే భారతీయులు ఏటా 18 శాతం చొప్పున పెరుగుతారు. తద్వారా మరో నాలుగేళ్లలో 534 మిలియన్ల మంది ఇంటర్నెట్ వాడే వారిలో చేరుతారు.

* ప్రతి పది మందిలో తొమ్మిది మంది కూడా ఏదో ఒక భారతీయ భాషను ఉపయోగిస్తున్నారు.

* భారతీయ భాషల్లో ఎక్కువగా.. తమిళం, హిందీ, కన్నడ, బెంగాళీ, మరాఠీ యూజర్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగు, గుజరాతీ, మలయాళం యూజర్స్ ఉన్నారు.

- రానున్న నాలుగేళ్లలో..

* ఇంటర్నెట్ ఉపయోగించడంలో ఇంగ్లీష్ యూజర్స్ కంటే హిందీ యూజర్స్ ఎక్కువగా ఉన్నారు. భారత దేశంలోన్ని అన్ని భాషల్లోకెల్లా హిందీనే ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

* మరాఠీ, బెంగాళీ, తమిళం, తెలుగు భాషలు 30 శాతం ఉన్నాయి.

- ఇంటర్నెట్‌ను ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారంటే...

సందేశాలు పంపించడం, ఎంటర్‌టైన్‌మెంట్, సోషల్ మీడియా, ఆన్ లైన్ న్యూస్.. కోసం భారతీయులు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

సందేశాలు - 169 మిలియన్లు
డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ - 167 మిలియన్లు
సోషల్ మీడియా - 115 మిలియన్లు
ఆన్ లైన్ న్యూస్ - 106 మిలియన్లు

డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ ప్రభుత్వ సర్వీస్‌లు, ఈ-టెయిలింగ్, డిజిటల్ క్లాసిఫైడ్స్ తదితరాల కోసం వినియోగిస్తున్నారు. కానీ తక్కువగానే ఉపయోగిస్తున్నారు.

ఆన్ లైన్‌ను డిజిటల్ పేమెంట్స్ కోసం 47 మిలియన్ మంది ఉపయోగిస్తున్నారు.
ఆన్ లైన్ గవర్నమెంట్ సర్వీస్ కోసం 41 మిలియన్లు ఉపయోగిస్తున్నారు.
ఈ-టెయిలింగ్ కోసం 42 మిలియిన్లు ఉపయోగిస్తున్నారు.
డిజిటల్ క్లాసిఫైడ్స్ కోసం 24 మిలియన్లు ఉపయోగిస్తున్నారు.

- ఆన్ లైన్ సర్వీస్ ఏవిధంగా ఎలా ఉపయోగిస్తున్నారంటే...

* 99 శాతం మంది మొబైల్ వినియోగదారులు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగంలో వీరిది 78 శాతం.

* 68 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇంగ్లీష్ కంటే స్థానిక భాషల్లో ఉపయోగించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

* 35 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు ప్రభుత్వ సర్వీస్‌లు, క్లాసిఫైడ్స్, న్యూస్, పేమెంట్స్ సర్వీసెస్‌ల యాక్సెస్ కలిగి ఉన్నారు.

* 88 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు స్థానిక భాషల్లోని డిజిటల్ ప్రకటనలకు స్పందిస్తున్నారు.

- భారతీయులు ఆన్ లైన్ ఉపయోగించడంలో ఎదుర్కొనే సమస్యలు..

* 60 శాతం మంది ఇంటర్నెట్ యూజర్స్ భాషాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

* 80 శాతం మంది ఇంగ్లీష్ కీ బోర్డ్‌ను ఉపయోగించేందుకు ఇబ్బంది పడుతున్నారు.

* అత్యధిక ఖర్చు, లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉందని 55 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్ రెగ్యులర్‌గా ఉపయోగించడానికి ఇది ఇబ్బందికరంగా మారింది.

- 2021 వరకు...

* ఆన్‌లైన్‌లో వార్తలు చూసే వారు ప్రస్తుతం 106 మిలియన్లు ఉన్నారు. సందేశాలు, ఇంటర్‌టైన్‌మెంట్, సోషల్ మీడియా తర్వాత.. ఇది నాలుగో స్థానంలో ఉంది. 2021 నాటికి ఇది 280 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.

* డిజిటల్ మీడియమ్ ద్వారా 32 మిలియన్ల మంది భారతీయులు న్యూస్ తెలుసుకుంటున్నారు.

* 60 శాతానికి పైగా ఇంటర్నెట్ యూజర్లు వారి వారి రీజినల్ లేదా లోకల్ న్యూస్ తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

- ప్రభుత్వ సేవలు

ఆన్ లైన్ గవర్నమెంట్ సేవలను వినియోగించడం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 41 మిలియన్లు వినియోగిస్తున్నారు. రానున్న నాలుగేళ్లలో ఇది 172 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.

* 28 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు ప్రభుత్వ సర్వీసుల యాక్సెస్ కలిగి ఉన్నారు. అప్లికేషన్‌లను ఫైల్ చేయడం, జాబ్ సెర్చ్, ప్రభుత్వపరమైన సమాచారం తెలుసుకోవడం, ట్యాక్స్‌కు సంబంధించిన అంశాలు ఉన్నాయి.

* హిందీ, బెంగాళీ, తమిళ్, గుజరాతీలలో ఆన్ లైన్ ప్రభుత్వ సేవల వినియోగం ఎక్కువగా ఉంది.

- ఈ టెయిలింగ్

42 మిలియన్ల మంది ప్రస్తుతం ఈ టెయిలింగ్ యాక్సెస్ కలిగి ఉన్నారు. రానున్న నాలుగేళ్లలో దీని ప్రగతి మూడు రెట్లు ఉంటుంది. అప్పుడు 165 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.

- డిజిటల్ పేమెంట్స్

ప్రస్తుతం 28 శాతం మంది భారతీయులు ఆన్ లైన్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. ఇది త్వరలో 43 శాతానికి పెరగనుంది. ప్రస్తుతం 47 మిలియన్లు ఉన్నారు. 175 మిలియన్లకు చేరుకుంటుంది.

- డిజిటల్ క్లాసిఫైడ్స్

డిజిటల్ క్లాసిఫైడ్స్‌ను స్థానిక భాషల్లో ఆసక్తి చూపిస్తున్నారు. స్థానిక భాషల్లో క్లాసిఫైడ్స్ ఉంటే ఇప్పుడున్న వారి కంటే యాభై శాతం మంది మొగ్గు చూపుతారు.

* ప్రస్తుతం 24 మిలియన్లు ఉంది. అది రానున్న కాలంలో 100 మిలియన్లకు చేరుకుంటుంది.

* ఉద్యోగాలు, మాట్రీమోనీ, రియల్ ఎస్టేట్ అడ్వర్టయిజ్‌మెంట్లలో గ్రోత్ ఉంది.

- డిజిటల్ అడ్వర్టైజింగ్

రానున్న నాలుగేళ్లలో 1.5 బిలియన్ డాలర్ల డిజిటల్ అడ్వర్టయిజింగ్ వ్యాపారం జరగవచ్చునని అంచనా వేస్తున్నారు.

* స్థానిక భాషల్లో డిజిటల్ అడ్వర్టయిజ్‌మెంట్ షేర్ 2021 వరకు 5 శాతం నుంచి 35 శాతానికి పెరగవచ్చునని అంచనా.

English summary
With an intention to extend the internet for every Indian, Google India has announced that neural machine translation is now available for nine languages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X