వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతిపై మోడీకి గౌతమి రాసిన లేఖ పూర్తి పాఠం

జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సినీ నటి గౌతమి రాసిన లేఖ తీవ్ర వివాదానికి కారణమైంది. ఆ లేఖలో ఏముందనే విషయాన్ని తెలుసుకోవడానికి పూర్తి పాఠాన్ని అందిస్తున్నాం.

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సినీ నటి గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జయలలిత మృతిపై గౌతమి పలు ప్రశ్నలు సంధించారు. ఆ రాసిన లేఖ పూర్తి పాఠం చదవండి...

గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి,శ్రీ నరేంద్ర మోడీజీడియర్ సర్,

భారతదేశానికి చెందిన ఓ సాధారణ పౌరురాలిగా నేను ఈ రోజు ఈ లేఖను రాస్తున్నాను. నేను ఓగృహిణిని, తల్లిని, వర్కింగ్ వుమెన్‌ని. నా జీవితంలో నా ప్రధానమైన పట్టింపు, ప్రాధాన్యాలు నా సహచర దేశస్థులు పంచుకుంటున్నట్లుగా ప్రాథమికంగా నా కుటుంబానికి సురక్షితమైన, అభివృద్ధికరమైన వాతావరణాన్ని కల్పించడం, వారు సురక్షితంగా జీవవిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అనుమతించడం.

మన దివంగత ముఖ్యమంత్రి సెల్వి డాక్టర్ జయలలితాజీ ఇటీవలి దిగ్భ్రాంతికరమైన మృతికి సంతాపం ప్రకటిస్తున్న కోట్లాది మందిలో నేను ఒకదాన్ని. భారత రాజకీయాల్లో ఆమెది శిఖరప్రాయమైన వ్యక్తిత్వం. అన్ని రంగాల్లోని మహిళలలకు ఆమె గొప్ప స్ఫూర్తిదాయకమైన మహిళ. తమిళనాడులో ఆమె నాయకత్వం, పలు విడతలు అధికారంలో అడడం మమ్మల్ని పలు రంగాల అభివృద్ధిలో ముందుకు తెచ్చారు. సెల్వీ డాక్టర్ జయలలిత అఖండితమైన శక్తి, స్థిర చిత్తంతో అన్ని విధాలైన ఆటంకాలను ఎదుర్కుని మిగిల్చిన వారసత్వం జీవితంలోని తమ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి స్త్రీపురుషుల్లోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని అందిస్తుంది.

Goutami's letter on Jayalalithaa's death to Modi

గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులు, దివంగత ముఖ్యమంత్రి ఆస్పత్రి పాలు కావడం, చికిత్స, కోలుకున్నట్లు వచ్చిన వార్తలు, అకస్మిక మృతి కారణంగా ఆమె మృతి అత్యంత విషాదకమైనది, కలవరపెట్టేది. ఈ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా కప్పిపుచ్చారు. ఎవరిని కూడా ఆమెతో కలువనీయలేదు. పలువురు ప్రముఖులకు కూడా ఆమెను కలిసి వ్యక్తిగతంగా ఆమెతో మాట్లాడడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ప్రేమాస్పదురాలైన ప్రజా నాయకురాలు, తమిళనాడు ప్రభుత్వ అధినేత విషయంలో అంత గోప్యతను పాటించి, ఏకాకిని చేశారు? ఏమి/ ఏ విధమైన అధికారం దివంగత ముఖ్యమంత్రిని కలుసుకోకుండా ఆంక్షలు పెట్టింది? అంత సున్నితమైన పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ జయలలితకు అందించే చికిత్స గురించి, తీసుకునే జాగరూకత గురించి నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? ఆ ప్రశ్నలకు ప్రజలకు సమాధానాలు ఇచ్చేందుకు బాధ్యత వహించేవారు ఎవరు? ఈ ప్రశ్నలతో పాటు బర్నింగ్ క్వొశ్చన్స్‌ను తమిళనాడు ప్రజలు వేస్తు్నారు. అయ్యా, వారి గొంతును మీ చెవిన వేయడానికి నేను ఈ పని చేస్తున్నాను.

అది అలా జరిగిందని కొంత మంది సందేహాస్పదమైన విషయమని కొంత మంది అనవచ్చు. కానీ, అయ్యా, నా భయమంతా అదే. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తమ నాయకుల గురించి తెలుసుకోవడం, సమాచారాన్ని పొందడం ప్రతి భారత పౌరుడి ప్రాథమిక పట్టింపు, హక్కు కాబట్టి నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. ప్రజలకు సుదీర్ఘ కాలం మేలు చేయడానికి విధులు నిర్వహించే సామర్థ్యం గురించి, ఆరోగ్యం గురించి ప్రజలకు తెలిసి ఉండాలి. ప్రియమైన ప్రజా నాయకురాలి సౌకర్యం, ఆరోగ్యం గురించి పట్టింపు ఉంటుంది. నిజానికి, అటువంటి అతి పెద్ద విషాదకర సంఘటన గురించి ప్రశ్నించకుండా, తప్పకుండా సమాధానం ఇవ్వకుండా ఎట్టి పరిస్థితిలోనూ సద్దుమణగడం సరి కాదు. అంతటి ప్రజా నాయకురాలి విషయంలోనే అలా జరిగితే వ్యక్తిగత హక్కుల కోసం పోరాడే అవకాశం సాధారాణ పౌరుడికి ఎలా ఉంటుంది? ప్రతి భారతీయుడికి ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం మన దేశాన్ని విలువైనదిగా తీర్చిదిద్దుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని పరిరక్షించాలి.

మన రోజువారీ జీవితంపై ప్రభావం వేసే ఏ విషయాన్నైనా ప్రతి భారతీయుడు తెలుసుకోవడానికి, సమాచారం పొందడానికి గల హక్కులను కాపాడుతారని, నా ఆందోళనను అర్థం చేసుకుంటారనే విశ్వాసంతో, అయ్యా, నేను మీకు రాస్తున్నాను. సామాన్ుడి హక్కులను పరిరక్షించడంలో నిలబడేందుకు మీరు ఏ విధమైన భయానికి లోను కారనే విషయాన్ని పలుమార్లు నిరూపించారు. మీ దేశ సహచరుల ఆర్తిని వింటారనే విశ్వాసం నాకు ఉంది.

అత్యంత గౌరవంతో, నమ్మకంతో
జై హింద్
గౌతమి తాడిమల్ల
8.12.2016

English summary
The sudden demise of our Chief Minister J.Jayalalithaa has definitely shaken every one of us. Many actors expressed their feelings through social media. Gautami has now written a letter to our honorable Prime Minister, Narendra Modi, in her official blog, questioning about the mystery behind CM's death. Her post is as follows:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X