వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నోట్ల ప్రింటింగ్ ఖర్చెంతో తెలుసా?: ఇదిగో వివరాలు..

ఒక్కో నోటు ముద్రణకు ఎంత ఖర్చవుతుందో చెప్పిన మేఘ్ వాల్.. మొత్తంగా కొత్త రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణకు ఎంత ఖర్చు చేస్తున్నారన్నది మాత్రం వెల్లడించలేదు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నోట్ల ముద్రణ ఖర్చు వివరాలు వెల్లడించారు. దీనిపై రాజ్యసభకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ మేరకు కొత్త రూ.500 నోటు ముద్రణకు రూ.2.87 నుంచి రూ.3.09 ఖర్చవుతున్నట్లు వెల్లడించారు.

అదే సమయంలో రూ.2వేల నోటు ముద్రణకు ఒక్కోదానికి రూ.3.54 నుంచి రూ.3.77 వరకు ఖర్చవుతున్నట్లు తెలిపారు. నోట్ల ముద్రణ ఖర్చులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అర్జున్ మేఘ్ వాల్ ఈ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Government reveals cost of printing new Rs 500 and Rs 2,000 notes

అయితే ఒక్కో నోటు ముద్రణకు ఎంత ఖర్చవుతుందో చెప్పిన మేఘ్ వాల్.. మొత్తంగా కొత్త రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణకు ఎంత ఖర్చు చేస్తున్నారన్నది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణ ఇంకా కొనసాగుతున్నందునా.. ఇప్పుడే వివరాలు వెల్లడించడం కుదరదని ఆయన అన్నారు. కొత్త నోట్ల ముద్రణ నిర్విరామంగా కొనసాగుతుందని వివరణ ఇచ్చుకున్నారు.

కాగా, గతేడాది నవంబర్ 8న కేంద్రం పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

English summary
The government today said it costs between Rs 2.87 and Rs 3.77 to print each currency note of Rs 500 and Rs 2000, but did not indicate the total cost involved in replacing the junk notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X