వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోస్ట్‌కార్డు, ఇన్‌లాండ్ లెటర్‌తో కేంద్రానికి ఎంతో నష్టం..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2013-14సంవత్సరానికి గాను ఒక్కో పోస్టు కార్డుపై రూ 7.03, ఇన్‌లాండ్ లెటర్‌పై రూ 4.93 నష్టాన్ని పోస్టల్ డిపార్ట్‌మెంట్ భరిస్తోందని పార్లమెంట్‌కు మంగళవారం సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా తెలియజేశారు.

రెండు సంవత్సరాల పాటు వరుసుగా తగ్గిన పోస్టల్ ట్రాఫిక్ తిరిగి పెరిగినట్టు ఆయన పేర్కొన్నారు. 2011-12, 2012-13 సంవత్సరాలకు గాను 3.3 శాతం, 5.2 శాతం తగ్గిన ఇన్‌లాండ్ లెటర్ల ట్రాఫిక్ అదే 2013-14 సంవత్సరానికి వస్తే 1.1 శాతం వృద్ధిని నమోదు చేసిని రూ 87.45 కోట్లను ఆర్జించామని ఆయన తెలిపారు.

Govt loses Rs 7 per post card, Rs 5 for inland letters

ఇక స్పీడ్ పోస్ట్ విభాగంలో మూడేళ్లు వరుసగా 14.8, 17.8, 7.8 శాతం పెరిగిందని వివరించారు. మొత్తం 18.16 లక్షల స్టాంపులను విక్రయించామని, 'మై స్టాంప్' స్కీం కింద పర్సనలైజ్డ్ స్టాంపుల విభాగం నుంచి రూ. 4.57 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.

ఈ స్కీం కింద అత్యధికంగా తమిళనాడు నుంచి అత్యధికంగా రూ. 54.20 లక్షల ఆదాయం రాగా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి ఆదాయమే రాలేదని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

English summary
Department of Posts incurred a loss of Rs 7.03 per post card and Rs 4.93 on every inland letter in 2013-14, Parliament was informed today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X