వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: పెట్రోల్, డీజీల్ ఇక డోర్ డెలీవరీ!, కారణమిదే

ఈ ఏడాది మే 14వ, తేది నుండి ఆదివారం నాడు పెట్రోల్ బంక్ లు మూతపడనున్నాయి.అయితే సెలవు రోజుల్లో కూడ పెట్రోల్ దొరికే అవకాశం ఉంది.నేరుగా ఇంటికే పెట్రోల్ రానుంది. ఇక పెట్రోల్ బంక్ ల వద్దకు వెళ్ళాల్సిన పరిస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే 14వ, తేది నుండి ఆదివారం నాడు పెట్రోల్ బంక్ లు మూతపడనున్నాయి.అయితే సెలవు రోజుల్లో కూడ పెట్రోల్ దొరికే అవకాశం ఉంది.నేరుగా ఇంటికే పెట్రోల్ రానుంది. ఇక పెట్రోల్ బంక్ ల వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండవు.

పెట్రోల్ కోసం ఇక బంక్ ల వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండవు. వినియోగదారులకు నేరుగా పెట్రోల్ ను అందించేందుకుగాను సౌకర్యాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.

ఆన్ లైన్ లో పెట్రోల్, డీజీల్ ఉత్పత్తులను బుక్ చేసుకొంటే డోర్ డెలివరీ చేసే ప్రతిపాదనపై కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ కసరత్తు చేస్తోంది.

ఆన్ లైన్ లో బుక్ చేసుకొంటే నేరుగా డోర్ డెలివరీ చేయడం వల్ల సమయం వృధా కాదు. ఏ రోజుల్లోనైనా పెట్రోల్, డీజీల్ దొరికే అవకాశం ఉంది. బంక్ ల వద్దకు వెళ్ళాల్సిన అవసరం మాత్రం లేదు.

ఈ కామర్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించిన కేంద్రం

ఈ కామర్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించిన కేంద్రం


ఆన్ లైన్ లో బుక్ చేస్తే నేరుగా ఇంటికే పెట్రోల్, డీజీల్ ను సరఫరా చేసే పద్దతిపై పరిశీలన చేయాలని కేంద్రం ఆదేశించింది. డోర్ టూ డోర్ డెలివరీ సర్వీసులు అందించేలా ఈ కామర్స్ విధానాన్ని పరిశీలించాలంటూ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్ పిసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించిందని సమాచారం.

నగదు రహితాన్ని ప్రోత్సహించేందుకే

నగదు రహితాన్ని ప్రోత్సహించేందుకే

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానం తోడ్పడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. పెట్రోల్ బంకుల్లో బారులు తారడం, సమయం వృధా కావడం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని చమురు శాఖ అభిప్రాయపడుతోంది. ఈ విధానం వల్ల వినియోగదారులకు కూడ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.మే 14 నుండి పలు రాష్ట్రాల్లో ఆదివారం నాడు పెట్రోల్ బంకులు మూసివేయాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఈ విధానం ప్రయోజనం కల్గించే అవకాశం ఉంది.

బంకులకు రోజూ 3.5 కోట్ల మంది

బంకులకు రోజూ 3.5 కోట్ల మంది

దేశీయంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 23.8 మిలియన్ టన్నుల పెట్రోల్, 76 మిలియన్ టన్నుల డీజీల్ వినియోగిస్తున్నారు. 2015-16 లో పెట్రోల్ 21.8 మిలియన్ టన్నులు, డీజీల్ వినియోగం74.6 మిలియన్ టన్నులే. ఇక నివేదిక ప్రకారంగా వాహనాల్లో ఇంధనం నింపుకోవడం కోసం ప్రతిరోజూ 3.5 కోట్ల మంది వాహానదారులు పెట్రోల్ బంకులకు వస్తుంటారని అంచనా.నిర్ధీష్ట సమయాల్లో బంకుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. .

పెట్రోల్ బంకుల్లో ఏటా రూ.2,500 కోట్ల లావాదేవీలు

పెట్రోల్ బంకుల్లో ఏటా రూ.2,500 కోట్ల లావాదేవీలు


పెట్రోల్ బంకుల్లో ఏటా రూ.2,500 కోట్ల విలువ చేసే లావాదేవీలు జరుగుతుంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇందులో సింహాబాగం నగదే. ఆన్ లైన్ డెలివరీ విధానాన్ని అమలు చేస్తే నగదు లావాదేవీల పరిమాణం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనా. పెద్దనోట్ల రద్దు తర్వాత ఎలక్ట్రానిక్ లావాదేవీలను ప్రోత్సహించడంపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రీకరించారు.

English summary
Soon, tanking up the car or buying diesel to run the generator may no longer entail a trip to the nearest petrol pump. The government is exploring the possibility of allowing all petroleum products — not just LPG cylinders — to be delivered at consumers’ doorstep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X