వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు పట్టాలపై గుజ్జర్లు: రోజుకు రూ. 15 కోట్లు నష్టం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్ధాన్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన దౌసా జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఆందోళనలో భాగంగా వారు ఢిల్లీ-ముంబై రైలు మార్గాన్ని నిర్భందించారు.

గుజ్జర్ల ఆందోళనతో రైల్వే అధికారులు ముంబై-ఢిల్లీ రైలు మార్గంలో పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను వేరే మార్గాల్లోకి దారి మళ్లించారు. రాజస్ధాన్‌లో గుజ్జర్లు చేస్తున్న ఆందోళన వల్ల రైల్వేశాఖకు రోజుకు రూ. 15 కోట్లు నష్టం వస్తుందని అధికారులు తెలిపారు.

గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

మే 21న ప్రారంభమైన గుజ్జర్ల ఆందోళన మంగళవారంతో ఐదో రోజుకి చేరుకుంది. గుజ్జర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతుండటంతో, సోమవారం రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వారితో జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.

గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

దౌసా జిల్లా సికిందరాలో ఆందోళన చేస్తున్న గుజ్జర్లను స్థానిక ప్రజలు సోమవారం తరిమికొట్టారు. దాంతో ఆందోళకారులు ఆదివారం నుంచి దిగ్బంధించిన జైపూర్-ఆగ్రా 11వ జాతీయ రహదారిపై పోలీసులు సోమవారం రాకపోకలను పునరుద్ధరించారు.

 గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

సికిందరాలో పలువురు ఆందోళనకారులు సోమవారం స్థానిక మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించి పలు దుకాణాలను దోచుకున్నారు. దీంతో ఆగ్రహోదగ్రులైన స్థానిక ప్రజలు గుజ్జర్లతో ఘర్షణకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించిన గుజ్జర్లను బలవంతంగా ఖాళీ చేయించారని జైపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ డీసీ జైన్ తెలిపారు.

 గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

కాగా, గుజ్జర్ల ఆందోళనతో ముంబై-ఢిల్లీ రైల్వే మార్గంలో సోమవారం కూడా రైళ్లు నడువలేదు. ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దుచేసింది. కొన్నిరైళ్లలను దారి మళ్లించింది.

 గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

మరోవైపు వసుంధరా రాజె నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో చర్చలకు వేదిక విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడటంతో రెండోదశ చర్చలు నిలిచిపోయాయి.

 గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

గుజ్జర్ల ఆందోళన: రైల్వేస్‌కు రోజూ రూ. 15 కోట్లు నష్టం

జైపూర్‌లో చర్చలు జరుపుతామని ప్రభుత్వం చెప్తుండగా, ఆందోళనకారుల కార్యక్షేత్రమైన భరత్‌పూర్ జిల్లా బయాన్ పట్టణంలో నిర్వహిస్తేనే చర్చలకు వస్తామని గుజ్జర్ల నాయకుడు కిరోరీసింగ్ భైస్లా తెగేసి చెప్పారు. ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు.

English summary
The Gujjar community's agitation demanding five percent reservation in government jobs continues in Rajasthan's Dausa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X