వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ రగడ: గుజ్జర్ల ఆందోళన, 10 రైళ్లు రద్దు, 57 మళ్లింపు

|
Google Oneindia TeluguNews

జైపూర్: ప్రభుత్వ ఉద్యోగాలలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ లో గుజ్జర్లు ఆందోళన ముమ్మరం చేస్తున్నారు. గతంలో ఆందోళన చేస్తున్న విధంగానే ఈసారి పలు ప్రాంతాలలోని రైలు మార్గాలను అడ్డుకున్నారు.

రైలు పట్టాల మీద బైఠాయించిన వేలాధి మంది గుజ్జర్లు ధర్నాలు చెయ్యడంతో ప్రభుత్వం పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. ఢిల్లీ-ముంబై మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భరత్ పూర్ ప్రాంతంలోని పిలుకాపుర వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

 Gujjars Protest in Rajasthan, 10 Trains Cancelled, 57 Diverted

ఈ ప్రాంతంలో ఆరు రైళ్ల మీద ప్రభావం పడింది. ప్రభుత్వ ఉద్యోగాలలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే ఉద్యమాలు నలిపి వేస్తామని గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ సమితి అధికార ప్రతినిధి హిమ్మత్ సింగ్ అంటున్నారు. గుజ్జర్ నాయకుడు కిరోరి సింగ్ మే 11వ తేది రిజర్వేషన్ల అంశంపై న్యాయయూత్ర ఆందోళన ప్రారంభించారు.

గత 8 సంవత్సరాల క్రితం జరిగిన పోరాటాలకు కిరోరి సింగ్ నాయకత్వం వహించారు. ప్రస్తుతం మాకు ఒక్క శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, 5 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం చేస్తామని అంటున్నారు. గుజ్జర్లు ఆందోళన వలన రాజస్థాన్ లో 10 రైళ్లు రద్దు చేశారు. 57 రైళ్ల సంచారాన్ని దారి మళ్లించారు.

English summary
Ten trains have been cancelled and 57 others, including two Rajdhanis from Delhi to Mumbai, have been diverted as nearly 1000 protesters sit on rail tracks in Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X