వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీడకల: కట్టుబానిసగా మార్చిన గల్ఫ్ కల

నూర్జహాన్ (38), ఆమె భర్త హర్షద్ గుజరాత్‌లోని షాహ్‌పూర్ వాసులు. ఆమె బ్యూటీషియన్, హర్షద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబ జీవన సాగిస్తున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: నూర్జహాన్ (38), ఆమె భర్త హర్షద్ గుజరాత్‌లోని షాహ్‌పూర్ వాసులు. ఆమె బ్యూటీషియన్, హర్షద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబ జీవన సాగిస్తున్నారు. అందరి మాదిరిగానే ఈ దంపతులు గల్ఫ్‌కు వెళ్లి భారీగా సంపాదించుకుంటే జీవితంలో సుఖ పడొచ్చని కల గన్నారు. అందుకు హర్షద్ తన ఆటోనూ, బ్యూటీషియన్‌గా తన పని కోసం కొని పెట్టుకున్న ఎయిర్ కండీషనర్ అమ్మేశారు.

రూ.2.5 లక్షల నగదును ముంబైలోని నిసార్ అనే ఇమ్మిగ్రెంట్ ఏజంట్ చేతిలో పోశారు. కానీ వారు సౌదీ అరేబియాకు చేరుకునే వరకు అసలు సంగతేమిటో తెలియదు. సౌదీకి వెళ్లాక నూర్జహాన్‌ను ఓ బ్యూటీషియన్ ఇంట్లో 'హోం సర్వీస్' కోసం నియమించారు.

ఈ పరిణామం ఆమె జైలుకెళ్లేందుకు.. జైలు నుంచి ఆమెను విడిపించేందుకు నూర్జహాన్ భర్త 2.5 లక్షల రూపాయలు అప్పుజేసి భారత్ కు తిప్పి పంపడానికి దారి తీసింది. చేసిన అప్పు తీర్చేందుకు హర్షద్ ఇంకా సౌదీ అరేబియాలోనే ఉన్నాడు. ఇలా సౌదీ తదితర గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేసి దండిగా డబ్బు సంపాదించుకోవచ్చునన్న ఆశలు, ఆకాంక్షలు గల వారి ఆలోచనలను సొమ్ము చేసుకునే వారు ఉన్నారు.

Gulf dream almost led to sex slavery

మహిళల అక్రమ రవాణాకు పాల్పడే వారూ ఉన్నారు. వాస్తవాలు వెలుగుచూసిన తర్వాత వీరి ఇమ్మిగ్రేషన్ ఏజంట్‌పై ఫిర్యాదు దరిమిలా ముంబై పోలీసులు నిసార్‌ను అరెస్ట్ చేసినప్పుడు అతడి ఇంట్లో 150 మహిళల పాస్‌పోర్టులు దొరికాయి.

గల్ఫ్‌కు వెళ్లేందుకు సర్వస్వం సమర్పణ

సర్వస్వం కోల్పోయిన నూర్జహాన్.. ప్రస్తుతం ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాము ఇమ్మిగ్రేషన్ ఏజంట్ నిసార్‌ను సంప్రదించినప్పుడు తనకు బ్యూటీషియన్‌గా, తన భర్తకు డ్రైవర్ గా ఒకేచోట ఉద్యోగం కల్పిస్తానని నమ్మ బలికాడని తెలిపారు. ఇద్దరికీ సుమారు 2500 సౌదీ రియాద్ల (రూ.44,700) వేతనం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని ఆమె తెలిపారు. 2015 ఆగస్టులో తాము దమ్మామ్ విమానాశ్రయంలో దిగిన తర్వాత గానీ అసలు సంగతి తెలియలేదని ఆమె చెప్పారు. అక్కడ సిద్ధంగా ఉన్న ఏజంట్ తన భర్త హర్షద్‌ను రియాద్ తీసుకెళ్తూ తనను మాత్రం దమ్మామ్ లోనే పని చేయాలని సూచించడంతో మోసపోయామని, తమ కల పీడకలగా మారిపోయిందని అర్థమైందని నూర్జహాన్ వాపోయారు.

ఏజెంట్ల హామీలు నీటిమీద రాతలు

'మా ఇద్దరికి ఒకేచోట ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి గుర్తుకు వచ్చి మేం షాక్‌కు గురయ్యాం. నన్ను జారాలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఓ మహిళ వద్ద పనిచేసేందుకు కుదిర్చారు. మూడు నెలల తర్వాత వచ్చి ఇఖామా (వర్క్ పర్మిట్) చూసింతర్వాత మరోసారి షాక్ అయ్యాను.

ఆ జాబితాలో నా పేరు సహాయకురాలు (పనిమనిషి) అని ఉంది' అని ఆమె చెప్పారు. తనతోపాటు మరో ఇండియన్, ఫిలెప్పో మహిళ ఆ ఇంట్లో 'హోం సర్వీస్' పేరిట పని చేసేవారమని తెలిపారు. అందులో అత్యంత సన్నిహితంగా గడుపాలని కోరినా తిరస్కరించకూడదు. పలుసార్లు తన వైవాహిక జీవితం, అనారోగ్యం పేరిట తప్పించుకుందామనుకున్నా.. లైంగిక దోపిడీకి గురిచేశారని నూర్జహాన్ బోరుమన్నారు.

పని మనుషులంటే జంతువుల కంటే హీనం

గత ఏడాది మార్చిలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ బాలిక చెప్పిన మాట వినకపోతే ఆమె మణికట్టు కట్ చేసి అక్రుత్యానికి పాల్పడ్డారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఉద్యోగం పేరిట కించపరుస్తూ తమను జంతువుల్లా చూసేవారన్నారు. తాను ఒకసారి చిన్నపాటి నిరసన తెలియజేస్తేనే జుట్టు పట్టుకుని లాగి తీవ్రంగా కొట్టారని చెప్పారు. తనను కొట్టడంతోపాటు తలపై పెట్టిన, మోచేతిపై పెట్టిన గుర్తులు అలాగే ఉన్నాయన్నారు. హైదరాబాదీ బాలిక ఆత్మహత్యాయత్నం తమను జైలుపాలు జేసిందన్నారు.

గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జైలులోనే మగ్గామని తెలిపారు. జైలులో ఉన్నంత కాలం తమ కుటుంబ సభ్యులను కలుసుకోవాలని పదేపదే ప్రార్థనలు చేసేవారమని ఆమె తెలిపారు. తాను జైలులో ఉన్న సంగతి తెలుసుకున్న తన భర్త హర్షద్ 14 వేల రియాద్లు (రూ.2.5 లక్షలు) అప్పుజేసి తనను విడిపించి, కాంట్రాక్ట్ నుంచి విముక్తుడ్ని చేశాడని, తర్వాత తనను భారత్‌కు పంపేశాడని నూర్జహాన్ తెలిపారు. ప్రస్తుతం తన విముక్తి కోసం చేసిన అప్పు కోసం తన భర్త హర్షద్ సౌదీలోనే ఉండిపోయాడని తెలిపారు.

అహ్మదాబాద్ పోలీసుల నిర్లక్ష్యం.. సకాలంలో స్పందించిన ముంబై పోలీసులు తమను మోసగించిన ఇమ్మిగ్రేషన్ ఏజంట్ నిసార్ పై కేసు నమోదు చేయాలని అహ్మదాబాద్ పోలీసులను కోరినా పట్టించుకోలేదని నూర్జహాన్ సోదరుడు తెలిపాడు. తమ సోదరిని వెనుకకు తీసుకు రమ్మని పదేపదే కోరినా పట్టించుకోలేదన్నాడు. కానీ ముంబై పోలీసులు సకాలంలో స్పందించి నిసార్, నజ్మాలను అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇంట్లో వందకు పైగా మహిళల పాస్ పోర్టులు దొరికాయని చెప్పాడు.

కనుక ముందూ వెనుక చూడకుండా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పేరిట పరుగులు తీయొద్దని మహిళలకు నూర్జహాన్ సూచించారు.

English summary
Noorjahan, 38, a resident of Shahpur, and her husband, Harshad, collected Rs 2.5 lakh to go to Saudi Arabia and live their Gulf. They sold their auto-rickshaw and the air-conditioner Noorjahan used at her beauty parlour, to collect the money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X