వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుదాస్‌పూర్: ఉగ్రవాదుల గ్లౌవ్స్ ‘మేడిన్ పాకిస్థాన్’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు మరికొన్ని ఆధారాలు లభించాయి. ఆ ఉగ్రవాదులు ధరించిన గ్లౌవ్స్‌పై ‘మేడిన్ పాకిస్థాన్' అనే అక్షరాలు రాసి ఉన్నాయి.

‘న్యూస్ డెయిలీ'లో వచ్చిన కథనం ప్రకారం.. పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులను పోస్టుమార్టం చేసిన వైద్యులు ఓ ఉగ్రవాది ధరించిన గ్లౌవ్స్‌పై ‘మేడిన్ పాకిస్థాన్' అని ఉండటాన్ని గుర్తించారు. ఈ ఘటనతో ఆ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారనే భారత వాదనలకు బలం చేకూర్చాయి.

పాక్ నుంచి వచ్చిన లష్కరే తయ్యెబె(ఎల్ఈటి) ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు భారత్ అనుమానిస్తోంది. కాగా, అమెరికా ప్రభుత్వానికి చెందిన రాత్రి వేళల్లోనూ లక్ష్యాన్ని చూపించే పరికరాలను కూడా ఉగ్రవాదుల దగ్గర స్వాధీనం చేసుకున్నారు. అఫ్ఘాన్‌లో దాడి సమయంలో ఉగ్రవాదులు ఈ పరికరాలను పొందినట్లుగా భావిస్తున్నారు.

Gurdaspur attack: Terrorists sported 'Made in Pakistan' gloves, say reports

ఇంతకుముందు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని స్పష్టం చేశారు. కాగా, పాకిస్థాన్ మాత్రం భారత ఆరోపణలు ఖండించింది. నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు లభించిన ఆధారాలను బట్టి ఆ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు రుజువైంది.

కాగా, ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ ఎస్పీతోపాటు పది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
In what could be another crucial piece of evidence proving all three terrorists killed in Gurdaspur attack were from Pakistan, gloves carrying 'Made in Pakistan' tags were worn by the insurgents, reports say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X