వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీసహా 11మంది మృతి: ఉగ్రవాదుల హతం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గురుదాస్‌పూర్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గురుదాస్‌పూర్ ఎస్పీతోపాటు 11 మంది పోలీసులు, పౌరులు మృతి చెందారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

సోమవారం ఉదయం సైనిక దుస్తులు ధరించిన సుమారు నలుగురు ఉగ్రవాదులు.. మొదట ఓ బస్సుపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌పై కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదుల దాడిలో 11 మంది మృతి చెందారు. మరికొందరు పౌరులు, పోలీసులకు బుల్లెట్ గాయాలయ్యాయి.

ఉగ్రవాదుల కాల్పల్లో గురుదాస్‌పూర్ ఎస్పీ భల్జీత్ సింగ్(డిటెక్టివ్ విభాగం) మృతి చెందారు. ఉగ్రవాదుల్లో ఓ మహిళా ఉగ్రవాది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 5.45గంటల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఈ సంఘటన చోటుచేసుకున్న దీననగర్ పాక్ సరిహద్దుకు అతి సమీపం(10కి.మీ)లో ఉండటం, ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కీలక స్థావరాలు ఉండటం గమనార్హం. కాగా, గురుదాస్‍‌పూర్ సమీపంలోని రైలు పట్టాలపై అమర్చిన 5 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి ఎన్ఎస్‌జి, సైనిక బలగాలను పంపించారు. పంజాబ్ ఘటనతో దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పుల ఘటనపై మంగళవారం పార్లమెంటులో ప్రకటన చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

గురుదాస్‌పూర్

గురుదాస్‌పూర్

పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గురుదాస్‌పూర్ ఎస్పీతోపాటు 11 మంది పోలీసులు, పౌరులు మృతి చెందారు.

రైలు పట్టాలకు అమర్చిన బాంబులు

రైలు పట్టాలకు అమర్చిన బాంబులు

గురుదాస్‍‌పూర్ సమీపంలోని రైలు పట్టాలపై అమర్చిన 5 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్రదాడిలో పౌరుడు మృతి

ఉగ్రదాడిలో పౌరుడు మృతి

సోమవారం ఉదయం సైనిక దుస్తులు ధరించిన సుమారు నలుగురు ఉగ్రవాదులు.. మొదట ఓ బస్సుపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌పై కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదుల దాడిలో 11 మంది మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన పోలీసులు

తీవ్రంగా గాయపడిన పోలీసులు

ఉగ్రవాదుల దాడిలో 11 మంది మృతి చెందారు. మరికొందరు పౌరులు, పోలీసులకు బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

తుపాకీతో పోలీసు

తుపాకీతో పోలీసు

ఉగ్రవాదుల కాల్పల్లో గురుదాస్‌పూర్ ఎస్పీ భల్జీత్ సింగ్(డిటెక్టివ్ విభాగం) మృతి చెందారు.

భద్రతా దళాలు

భద్రతా దళాలు

ఉగ్రవాదుల్లో ఓ మహిళా ఉగ్రవాది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 5.45గంటల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

ఉగ్రవాదుల వేటలో

ఉగ్రవాదుల వేటలో

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

భద్రతా దళాలు

భద్రతా దళాలు

పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

భద్రతా దళాలు

భద్రతా దళాలు

ఈ సంఘటన చోటుచేసుకున్న దీననగర్ పాక్ సరిహద్దుకు అతి సమీపం(10కి.మీ)లో ఉండటం, ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కీలక స్థావరాలు ఉండటం గమనార్హం.

తుపాకీ ఎక్కుపెట్టి..

తుపాకీ ఎక్కుపెట్టి..

ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి ఎన్ఎస్‌జి, సైనిక బలగాలను పంపించారు.

English summary
Eight people, including two policemen died after militants wearing army uniform on Monday went on a rampage attacking a bus, a health centre and a police station Dinanagar town in Gurdaspur district of Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X