వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల లేని యువతుల మృతదేహాల కలకలం: తాంత్రికుల పనేనా?

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సాక్ష్యంగా తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో రెండు తలలేని యువతుల మొండాలు భయటపడ్డాయి. చేతబడులు చేసే తాంత్రికులే ఈ హత్యలకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికంగా ఈ హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

ఎన్డీటీవీ కథనం ప్రకారం.. తంలుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తమలపాకు వ్యవసాయం క్షేత్రంలో తల లేని ఓ 18ఏళ్ల యువతి మృతదేహం కనిపించింది. రెండు గంటల తర్వాత 60 కి.మీల దూరంలోని నందిగ్రామ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ప్రాంంతంలో మరో తల లేని యువతి మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

కాగా, ఓ మృతదేహం వద్ద పువ్వులు, ధూపాలు, ఎర్రని కుంకుమ ఉండటంతో ఈ రెండు హత్యలు తాంత్రికులే చేసి ఉంటారని తెలుస్తోంది. మరో మృతదేహం మాత్రం సమీపంలోని పొదల్లో పడివుంది.

black magic

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. రెండు మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. వాటి తలల కోసం వెతుకుతున్నారు. నిందితులు ఇక్కడే హత్య చేశారా? లేక ఎక్కడైనా హత్య చేసి మృతదేహాలను ఇక్కపడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పువ్వులు, ధూపాలు, కుంకుమ లాంటి పదార్థాలు మృతదేహం వద్ద లభించడంతో
తాంత్రికులే ఈ హత్యలు చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ రెండు హత్యల మధ్య కొన్ని గంటల తేడా ఉండటంతో రెండు హత్యలను ఒకే నిందితులు చేశారా? లేక వేర్వేరు నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.

English summary
Headless bodies of two young women were found in Bengal's East Midnapore district on Saturday, leading police to suspect that a ‘tantrik’ may be responsible for the murders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X