వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో హైటెన్షన్: గ్రామాలు ఖాళీ, వెంకయ్య ఫైర్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎల్ఓసీలోని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు నేపథ్యంలో బోర్డర్‌లో కేంద్రం ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ముఖ్యంగా కాశ్మీర్‌లోని విమానాశ్రయాలు, వైమానికి స్థావరాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నేషనల్ బోర్డర్‌కు ఆనుకుని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ గ్రామాలను బీఎస్ఎఫ్ ఖాళీ చేయిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అఖిలపక్ష భేటీకి రావాలని విపక్ష నేతలందరికీ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాచారం ఇచ్చారు. పాక్‌పై భారత సైన్యం దాడికి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

high tension at india pakistan border

సరిహద్దులో ప్రస్తుత పరిస్థితిని హోంమంత్రి రాజనాథ్‌ సింగ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలకు ఎప్పటికప్పుడు వివరించారు. భారత్ దాడులపై కేంద్ర మంత్ర వెంకయ్య స్పందించారు. పాకిస్థాన్ ఇప్పటికైనా ఉగ్రవాదులకు సాయం చేయడాన్ని మానుకోవాలన్నారు.

ఎల్ఓసీలోని పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడికి ప్రపంచ దేశాలన్నింటి నుంచి మద్దతు లభిస్తోందన్నారు. పీఓకే ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో పాకిస్థాన్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. దేశ భద్రతను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ చెప్పారని అన్నారు.

జాతి సమగ్రత, దేశ ఐక్యత, భద్రత, రక్షణలను కాపాడే దిశలో భాగంగా భారత సైన్యం ఈ దాడులకు పాల్పడిందని వెంకయ్య తెలిపారు. భారత నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భగ్నం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ దాడులను నిర్వహించామని ఆర్మీ డీజీఎంవో రణబీర్ సింగ్ తెలిపారు.

తాము ఎంత సానుకూలంగా చెబుతున్నా, పాకిస్థాన్ వైపు నుంచి ఉగ్రవాదులకు ప్రోత్సాహం మాత్రమే లభిస్తోందని వెంకయ్య అన్నారు. పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని ఆ దేశాన్ని భారత్ పదే పదే కోరుతున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు.

English summary
high tension at india pakistan border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X