వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్ రాజకీయ సునామీ: ఏకమైన హిందూ సంఘాలు: రంగంలోకి డీజీపీ !

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఓ సునామీగా మారింది. రజనీకాంత్ కు మద్దతుగా అనేక హిందూ సంఘాలు ఏకమైనాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారీ పోలీసు భద్రత కల్పించాలంటూ డీజీపీ కార్యాలయానికి, చెన్నై నగర పోలీసు కమిషనర్ కు అధిక సంఖ్యలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. రజనీకాంత్ కు, ఆయన ఇంటికి భద్రత కల్పించాలని తాజాగా పలు హిందూ సంఘాలు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. హిందూ మక్కల్ కట్చి తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి రామ్ రవి కుమార్ తమిళనాడు డీజీపీకి వినతి పత్రం సమర్పించారు.

<strong>రజనీకాంత్ ఫస్ట్ వికెట్ డీఎంకే: జగద్రక్షకన్ ఎంట్రీ ? జయలలితనే ఎదరించాడు, ఎవరంటే ?</strong>రజనీకాంత్ ఫస్ట్ వికెట్ డీఎంకే: జగద్రక్షకన్ ఎంట్రీ ? జయలలితనే ఎదరించాడు, ఎవరంటే ?

రజనీకాంత్ రాజకీయాల్లోకోస్తే ఎక్కడ తమ జీవితాలు తారుమారు అవుతాయో అనే భయంతో కొందరు ఆయన ఇంటి దగ్గర ఆందోళనలు చేస్తున్నారని రామ్ రవికుమార్ ఆరోపించారు. రజనీకాంత్ కు వ్యతికేరకంగా ఆందోళనలకు దిగుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆల్ ఇండియా హిందూ సత్యసేన

ఆల్ ఇండియా హిందూ సత్యసేన

ఆల్ ఇండియా హిందూ సత్యసేనా సంఘం అధ్యక్షుడు వసంతకుమార్ రవి చెన్నై నగర పోలీసు కమిషనర్ ఏకే. విశ్వనాథన్ కు వినతిపత్రాన్ని అందించారు. రజనీకాంత్ కు, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని మనవి చేశారు.

సమాజంలో మార్పు కోసం

సమాజంలో మార్పు కోసం

నటుడు రజనీకాంత్ తమిళ ప్రజలకు సేవ చెయ్యాలని, తమిళనాడులో పెద్ద మార్పులు తీసుకురావాలని సమాజ శ్రేయస్సుతో పత్రికల వారికి భేటీ ఇస్తున్నారని, దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలకు చెందిన వారు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారని వసంతకుమార్ రవి మండిపడ్డారు.

కుదిపేసిన రజనీకాంత్

కుదిపేసిన రజనీకాంత్

రజనీకాంత్ ఇటీవల తన అభిమానులను కలిసిన సమయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను కుదిపేస్తున్నాయనే చెప్పాలి. రాజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నవారు చాల మందే ఉన్నారు. అదే విధంగా రజనీకాంత్ ను వ్యతిరేకిస్తున్న వారి వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి.

గల్లంతు అవుతారనే స్వార్థంతో

గల్లంతు అవుతారనే స్వార్థంతో

ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు వ్యతిరేకంగా కొన్ని తమిళ సంఘాలు ఆయన దిష్టిబోమ్మలు దహనం చేస్తూ చట్ట విరుద్దంగా ప్రవర్థిస్తున్నారు. రజనీకాంత్ కు మద్దతుకు తమిళనాడులోని అనేక సంఘాలు, ఆయన అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు.

కుటుంబ సభ్యులకు భద్రత

కుటుంబ సభ్యులకు భద్రత

ఈ నేపథ్యంలోనే రజనీకాంత్, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని డీజీపీ, చెన్నై నగర పోలీసు కమిషనర్ లకు వినతి పత్రం సమర్పిస్తున్నారు. చెన్నై నగర పోలీసులు ఇప్పటికే పోయెస్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.

రజనీకాంత్ కోసం ఏకమైన హిందూ సంఘాలు !

రజనీకాంత్ కోసం ఏకమైన హిందూ సంఘాలు !

రజనీకాంత్ కు మద్దతుగా తమిళనాడులోని అనేక హిందూ సంఘ, సంస్థలు ఏకం అవుతున్నాయి. రోజురోజుకు హిందూ సంఘాలు రజనీకాంత్ కు మద్దతుగా నిలబడుతున్నాయి. తాజాగా హిందూ మక్కల్ కట్చి, ఆల్ ఇండియా హిందూ సత్యసేనా తదితర సంఘాలు రజనీకాంత్ కు మద్దతు ప్రకటించడంతో పాటు ఆయనకు పోలీసు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి మనవి చేశాయి.

రజనీకాంత్ సునామీ

రజనీకాంత్ సునామీ

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం రజనీకాంత్ ఓ సునామిలా తయారైనారు. చిన్నాచితకా సంఘాలు ఆయన రాజకీయ రంగప్రవేశం గురించి విమర్శలు చేస్తున్నాయి. అయితే పలువురు రాజకీయ ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశాన్ని బహిరంగంగానే స్వాగతిస్తున్నారు. ఈ సందర్బంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ చెన్నై నగర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

English summary
Vasanthakumar Ravi of All India Hindu Sathya Sena said, Having in mind the present political situation of Tamil Nadu and the welfare of people of the state, Rajinikanth has been giving interviews to the media with a keen interest to create a change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X